Kiara Advani : చరణ్ – శంకర్ సినిమా.. బెస్ట్ బ‌ర్త్‌డే గిఫ్ట్‌..

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీకి RC 15 టీం సాలిడ్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది..

Kiara Advani : చరణ్ – శంకర్ సినిమా.. బెస్ట్ బ‌ర్త్‌డే గిఫ్ట్‌..

Rc 15

Kiara Advani: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీకి RC 15 టీం సాలిడ్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. టాలీవుడ్‌లో ‘విన‌య విధేయ‌రామ‌’, ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమాల్లో న‌టించి మెప్పించిన కియారా అద్వాణీ ఇప్పుడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్‌ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న భారీ పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా న‌టించ‌నున్నట్లు శ‌నివారం(జూలై 31) కియారా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

Kiara Advani : బ్యూటిఫుల్ కియారా బర్త్‌డే పిక్స్..

‘‘ఇప్ప‌టి వ‌ర‌కు నా పుట్టిన‌రోజుకి వ‌చ్చిన గిఫ్ట్స్‌లో క‌చ్చితంగా ఇది బెస్ట్ బ‌ర్త్‌డే గిఫ్ట్‌. చ‌ర‌ణ్‌, శంక‌ర్‌ గారు, రాజు గారు, శిరీష్ గారు.. ఇంత పెద్ద కాంబినేష‌న్‌లో సినిమా చేస్తుండ‌టం నాకు చాలా ఎగ్జ‌ైటింగ్‌గా ఉంది. అలాగే నెర్వ‌స్‌గానూ అనిపిస్తుంది. చాలా గొప్ప అవ‌కాశం. షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’’ అంటూ తన హ్యాపీనెస్‌ని షేర్ చేసుకుంది కియారా..

Kiara Advani : కియారా కమిట్‌మెంట్.. శంకర్‌తో ఎన్ని సినిమాలంటే..

రామ్‌ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 15వ చిత్ర‌మిది. అలాగే శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ ప్రెస్టీజియ‌స్‌గా నిర్మిస్తున్న 50వ చిత్రం. తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ రూపొంద‌నుంది.