Kiara Advani: RC15 షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన కియారా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘RC15’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల చరణ్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు కోసం అమెరికా వెళ్లడంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు.

Kiara Advani: RC15 షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన కియారా

Kiara Advani Lands In Hyderabad For RC15 Shoot

Kiara Advani: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘RC15’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల చరణ్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు కోసం అమెరికా వెళ్లడంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు. అయితే, ప్రస్తుతం చరణ్ తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో, మళ్లీ ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Naatu Naatu : RC15 సెట్‌లో ప్రభుదేవా 100 మంది డాన్సర్స్‌తో కలిసి నాటు నాటు స్టెప్..

ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమాలోని పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ షూటింగ్ లో అందాల భామ కియారా అద్వానీ కూడా పాల్గొనబోతోంది. దీనికోసం తాజాగా ఈ బ్యూటీ హైదరాబాద్ చేరుకుంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి తరువాత తిరిగి సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్న కియారా, RC15 మూవీని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తోంది.

RC15 : చరణ్ బర్త్ డేకి టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్.. కన్‍ఫార్మ్ చేసిన దిల్ రాజు!

ఇక ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని కియారా ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాకు ‘సీఈఓ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తోండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూ్స్ చేస్తున్నాడు.