Kiara Advani : పెళ్లి చేసుకోకుండా కూడా లైఫ్‌లో సెటిల్ అవ్వొచ్చు.. డబ్బులు సంపాదిస్తే చాలు..

కియారాని మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుతారు? అని అడిగారు ఓ విలేఖరి. దీనికి కియారా సమాధానమిస్తూ.. ''పెళ్లి చేసుకోకుండా కూడా జీవితంలో సెటిల్ అవ్వొచ్చు. ప్రస్తుతం.................

Kiara Advani :  పెళ్లి చేసుకోకుండా కూడా లైఫ్‌లో సెటిల్ అవ్వొచ్చు.. డబ్బులు సంపాదిస్తే చాలు..

Kiara Advani

Kiara Advani :  తెలుగులో ‘భరత్‌ అనే నేను’ సినిమాతో మెప్పించిన కియారా అద్వానీ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమాలు చేస్తుంది కియారా. ఇటీవలే కియారా చేసిన భూల్ భులాయ 2 సినిమా మంచి విజయమే సాధించింది బాలీవుడ్ లో. దీంతో సక్సెస్ జోష్ లో ఉన్న కియారా త్వరలో ‘జుగ్‌ జుగ్‌ జియో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. వరుణ్‌ ధావన్‌తో జోడిగా నటించిన ఈ బాలీవుడ్ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది.

ఈ ట్రైలర్‌ లాంచింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకి చిత్ర బృందం సమాధానాలిచ్చారు. ఇందులో భాగంగా కియారాని మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుతారు? అని అడిగారు ఓ విలేఖరి. దీనికి కియారా సమాధానమిస్తూ.. ”పెళ్లి చేసుకోకుండా కూడా జీవితంలో సెటిల్ అవ్వొచ్చు. ప్రస్తుతం నేను పని చేస్తున్నాను, బాగానే డబ్బులు సంపాదిస్తున్నాను. దీంతో నేను సంతోషంగా ఉన్నాను. లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే పెళ్లి చేసుకోనవసరంలేదు, డబ్బులు సంపాదిస్తే చాలు” అని తెలిపింది.

Directors : స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్స్

అయితే కియారా అద్వాని కొంత కాలంగా బాలీవుడ్‌ యువ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో డేటింగ్‌ చేస్తుందని, వారిద్దరూ లవ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. దీనిపై మాత్రం వీరిద్దరూ క్లారిటీ ఇవ్వలేదు.