నాగ్ : అన్నం తింటున్నాడా, అందం తింటున్నాడా?

రీసెంట్‌గా రాహుల్, నాగ్ వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ అప్‌లోడ్ చేసాడు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు కూడా నాగ్ చేస్తున్నవర్కౌట్స్ చెయ్యాలంటే, కొంచెం ఆలోచిస్తారేమో అన్నంత కఠినమైన వర్కౌట్స్ చేస్తున్నాడాయన..

  • Published By: sekhar ,Published On : April 27, 2019 / 06:58 AM IST
నాగ్ : అన్నం తింటున్నాడా, అందం తింటున్నాడా?

రీసెంట్‌గా రాహుల్, నాగ్ వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ అప్‌లోడ్ చేసాడు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు కూడా నాగ్ చేస్తున్నవర్కౌట్స్ చెయ్యాలంటే, కొంచెం ఆలోచిస్తారేమో అన్నంత కఠినమైన వర్కౌట్స్ చేస్తున్నాడాయన..

ఈ మనిషి అందరిలానే అన్నం తింటున్నాడా లేక, అందం తింటున్నాడా ? అని డౌట్ వచ్చేలా, రోజు రోజుకీ మరింత గ్లామర్‌గా తయారవుతున్నాడు అక్కినేని నాగార్జున.. ‘ఆరవై’లో ‘ఇరవై’లా ఇలా కనిపించడానికి ఆయన చేస్తున్న కసరత్తులు మామూలుగా ఉండవు మరి.. కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ జంటగా, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో, మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై, నాగార్జున, పి.కిరణ్ నిర్మాణంలో మన్మథుడు-2 తెరకెక్కుతుంది. గతకొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతుంది. షూటింగ్ చేస్తూ ఎగ్జైట్ అవుతున్న డైరెక్టర్ రాహుల్, అక్కినేని అభిమానులను, ప్రేక్షకులను సర్ ప్రైజ్ చెయ్యాలని వాయిదాల పద్ధతిలో కొన్ని వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు.
Also Read : మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నా ఫ్యాన్స్!

ఆ పిక్స్‌లో నాగ్, రకుల్ పెయిర్ చాలా బాగుంది. ఇక మన్మథుడు అయితే మరింత అందంగా, అందరూ ఆశ్చర్యపోయేలా ఉన్నాడు. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని నాగార్జున బాబుని చూస్తే తెలుస్తుంది. రీసెంట్‌గా రాహుల్, నాగ్ వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ అప్‌లోడ్ చేసాడు.

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు కూడా నాగ్ చేస్తున్నవర్కౌట్స్ చెయ్యాలంటే, కొంచెం ఆలోచిస్తారేమో అన్నంత కఠినమైన వర్కౌట్స్ చేస్తున్నాడాయన.. మరి మన్మథుడు అని ఊరికే అంటారా ఏంటి.. దటీజ్ నాగ్.. ఈ మూవీలో లక్ష్మీ, సమంత, నాజర్, రావు రమేష్, ఝాన్సీ, వెన్నెల కిషోర్ తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.