నాగ్‌ అరుదైన రికార్డ్‌.. సినీ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 12:25 PM IST
నాగ్‌ అరుదైన రికార్డ్‌.. సినీ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్.. తండ్రీ కొడుకుల సరసన నటించడం చాలా రేర్ అనే చెప్పాలి. అయితే తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో తండ్రి సరసన నటించిన హీరోయిన్లు చాలా మంది కొడుకులతో కూడా నటించారు. కానీ నాగ్ మాత్రం తకన్న ముందు జనరేషన్‌తో నటించిన హీరోయిన్లతో పాటు తన తరువాతి జనరేషన్‌తో నటించిన హీరోయిన్లతోనూ కలిసి నటిస్తున్నాడు.

ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఎన్నో సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవితో నాగార్జున పలు సూపర్‌ హిట్ సినిమాలు చేశాడు. తాజాగా తన తనయుడు నాగచైతన్య సరసన రారండోయ్‌ వేడుక చూద్దాం సినిమాలో నటించిన రకుల్ ప్రీత్‌ సింగ్‌తో ఇపుడు ‘మన్మథుడు’ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘మన్మథుడు 2’ లో నటిస్తున్నాడు. అంటే తండ్రి సరసన హీరోయిన్‌గా చేసిన భామతో, కొడుకు సరసన హీరోయిన్‌గా చేసిన భామతోనూ కలిసి నటించిన అరుదైన రికార్డ్‌ను సాధించాడు కింగ్‌.  

ఈ రకంగా అటు తండ్రి ఏఎన్నాఆర్ సరసన నటించిన హీరోయిన్స్‌తో పాటు..ఇటు తనయుడు నాగ చైతన్యకు జోడిగా నటించిన భామలతో సిల్వర్ స్క్రీన్‌పై జోడిగా నటించిన ఏకైక హీరోగా నాగార్జున రికార్డు సృష్టించాడు. కానీ నాగార్జున తోటి హీరోలైన చిరంజీవి, బాలకృష్ణలు ఈ రికార్డు అందుకోలేదు.