Kirak RP : కిరాక్ ఆర్పీ ఇల్లు చూశారా?.. స్టార్ సెలబ్రిటీలను మించి..

తాజాగా తన పేరు మీద కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో తన హోమ్ టూర్ వీడియో చేశాడు. ఈ వీడియోలో ఆర్పీ ఇల్లు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. స్టార్ సెలబ్రిటీలకు మించి ఆర్పీ.....

Kirak RP : కిరాక్ ఆర్పీ ఇల్లు చూశారా?.. స్టార్ సెలబ్రిటీలను మించి..

Kirak Rp

Kirak RP :  ఇటివల సెలబ్రిటీలంతా తమ ఇళ్ళని చూపిస్తూ హోమ్ టూర్ పేరుతో వీడియోల్ని చేస్తున్నారు. ఆ వీడియోల్ని తమ యూట్యూబ్ ఛానల్ లో పెట్టి అభిమానులకి, ప్రేక్షకులకి మరింత దగ్గరవుతున్నారు. అదే కోవలో ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా హోమ్ టూర్ చేశాడు. జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన వాళ్లలో కిరాక్ ఆర్పీ ఒకరు. కిరాక్ ఆర్పీ టీంతో తన సగటూరు పంచులతో తనదైన స్టైల్ లో అందర్నీ నవ్విస్తూ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత జబర్దస్త్ ని వీడి ప్రస్తుతం కామెడి స్టార్స్ అనే ప్రోగ్రాంలో చేస్తున్నాడు. అయితే మొదటి నుంచి కూడా డైరెక్షన్ టీం నుంచి రావడంతో డైరెక్టర్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆర్పీ.

తాజాగా తన పేరు మీద కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో తన హోమ్ టూర్ వీడియో చేశాడు. ఈ వీడియోలో ఆర్పీ ఇల్లు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. స్టార్ సెలబ్రిటీలకు మించి ఆర్పీ ఇల్లు ఉంది. రెండు అంతస్తుల్లో ఆర్పీ ఇల్లు ఉంది. చాలా ప్లానింగ్ గా దగ్గరుండి కట్టించుకున్నాడు ఆర్పీ. ఆర్పీ ఇల్లు చాలా లగ్జరీగా ఉంది.

Ankit Siwach : మాకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. బట్టలు లేకుండా ఫోటోలు పంపమన్నారు..

ఇంట్లో ముందు అతి విశాలవంతమైన హాల్ ని చూపించాడు. హాల్ లో ఖరీదైన సోఫాలు, అక్వేరియం, అతనకి వచ్చిన అవార్డులు, పెద్ద టీవీ, ఆర్పీ ఫొటోలు చూపించాడు. తర్వాత అత్యాధునికమైన కిచెన్, డైనింగ్ టేబుల్, పెద్ద ఫ్రిడ్జ్, ఇంట్లో మొక్కలు, మాస్టర్ బెడ్ రూమ్, అందులో వారి ఫ్యామిలీ ఫొటోలు, తన ఇల్లు రెండు అంతస్తులు ఉండటంతో ఇంటి లోపలే పెట్టించుకున్న లిఫ్ట్, ఇంకో బెడ్ రూమ్, స్టడీ హాల్, పర్సనల్ బెడ్ రూమ్ చూపించాడు.

Shivathmika : పారిపోయింది నేనా? మా అక్కా??.. ఫేక్ న్యూస్ పై ఫైర్ అయిన శివాత్మిక..

ఇక పర్సనల్ బెడ్ రూమ్ లో తాను ప్రేమించిన అమ్మాయితో ఉన్న ఫోటో కూడా చూపించి తనని నెక్స్ట్ మంత్ నిశితార్థం చేసుకోబోతున్నాను అని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపాడు. ఇంకో ఫ్లోర్ లో స్పెషల్ హోమ్ థియేటర్, టెర్రస్, టెర్రస్ లో ఉండే మొక్కలు ఇలా అన్ని చూపించాడు. ప్రస్తుతం ఆర్పీ చూపించిన తన ఇంటి వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియో చూసిన వారంతా ఇంత పెద్ద లగ్జరీ ఇల్లా అని ఆశ్చర్యపోతున్నారు.