Kiran Abbavaram: కొత్త హీరో.. వరసగా ఐదు సినిమాల హీరో!

ఓ మెగాస్టార్ చిరంజీవి.. నానీ.. విజయ్ దేవరకొండ.. నిఖిల్.. విశ్వక్ సేన్.. శ్రీహర్ష.. ఇలా కొద్దిమంది హీరోలకు ఓ ప్రత్యేకత ఉంది. అదే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోలుగా ఎదగడం. ఇందులో కొందరు స్టార్స్ కావచ్చు.. మరికొందరు నటులుగా మిగిలిపోవచ్చు. కానీ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన తీరు మాత్రం చెప్పుకొని తీరాల్సిందే.

Kiran Abbavaram: కొత్త హీరో.. వరసగా ఐదు సినిమాల హీరో!

Kiran Abbavaram

Kiran Abbavaram: ఓ మెగాస్టార్ చిరంజీవి.. నానీ.. విజయ్ దేవరకొండ.. నిఖిల్.. విశ్వక్ సేన్.. శ్రీహర్ష.. ఇలా కొద్దిమంది హీరోలకు ఓ ప్రత్యేకత ఉంది. అదే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోలుగా ఎదగడం. ఇందులో కొందరు స్టార్స్ కావచ్చు.. మరికొందరు నటులుగా మిగిలిపోవచ్చు. కానీ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన తీరు మాత్రం చెప్పుకొని తీరాల్సిందే. వీరి సరసన నిలుస్తాడో లేదో కానీ ఓ యంగ్ హీరో ఇప్పుడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తొలి సినిమాతోనే వరసగా సినిమాలను సైన్ చేస్తూ బిజీబిజీగా మారిపోయాడు.

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో సైలెంట్‏గానే వరుస అవకాశాలు వచ్చాయి. ఇప్పటికే కిరణ్ పూర్తిచేసిన ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమా టీజర్ ఇతర ప్రోమోలతో మంచి ఎంటర్టైనర్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా కిరణే అందించగా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. సినిమాలన్నీ ఓటీటీ వైపు చూస్తున్నా ఈ సినిమా మాత్రం ఆగస్టు 6న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.

ఇది కాకుండా కిరణ్ ఇప్పుడు మరో మూడు సినిమాలను లైన్లో పెట్టేశాడు. గురువారం కిరణ్ పుట్టినరోజు కావడంతో ఈ మూడు సినిమాలు అప్ డేట్ ఇచ్చేశాయి. ఇందులో ‘సమ్మతమే’ అనే సినిమా ఒకటి కాగా చాందిని చౌదరి హీరోయిన్. ఇది కాక ‘సెబాస్టియన్’ అంటూ ఒక పోలీస్ స్టోరీలోనూ నటిస్తున్నాడు. ఇది కూడా దాదాపుగా పూర్తయింది. దాని టీజర్ కూడా ఆకట్టుకుంది. తాజాగా కోడి రామకృష్ణ తనయురాలు దివ్య దీప్తి నిర్మాణంలో కిరణ్ హీరోగా కార్తీక్ శంకర్ కొత్త దర్శకుడు రూపొందించనున్న సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు.

దీంతో గ్యాప్ లేకుండా కిరణ్ హీరోగా మొత్తం ఐదు సినిమాలు క్యూలో వస్తున్నాయి. ఇప్పటికే వచ్చేసిన రాజావారు రాణిగారు సినిమాలో కిరణ్ నటనకు విమర్శకుల నుండి ఎలాంటి విమర్శలు లేకపోవడం.. ఇలా వరస సినిమాలు మొదలవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ కొత్త హీరో గురించి చర్చ జరుగుతుంది. ఇందులో ఒకటి, రెండు సినిమాలు సక్సెస్ కొట్టినా కిరణ్ ఇండస్ట్రీలో ఎదగడం మరింత సులభం అవుతుందనిపిస్తుంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.