Meter Trailer: యాక్షన్ డోస్ పెంచేసిన కిరణ్ అబ్బవరం.. మీటర్ సెట్ అయినట్టే!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘మీటర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.

Kiran Abbavaram Increases Action Dose In Meter Trailer
Meter Trailer: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘మీటర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు మీటర్ అనే టైటిల్‌తోనే హైప్ తీసుకొచ్చింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నెలకొన్ని అంచనాలను మరింత పెంచేశాయి. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.
Meter Movie: ట్రైలర్‌తో ‘మీటర్’ను మరింత పెంచేందుకు రెడీ అయిన కిరణ్ అబ్బవరం
మీటర్ ట్రైలర్‌ను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కట్ చేశారు చిత్ర యూనిట్. హీరో కిరణ అబ్బవరం చాలా ఎనర్జీతో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కిరణ్ నటిస్తుండగా, విలన్లను ఆయన ఎలా ఎదురించాడు.. వారితో కిరణ్‌కు ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అనే అంశాలు ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు మనకు చూపెట్టారు. అటు హీరోయిన్ అతుల్య రవి చాలా గ్లామరస్‌గా కనిపిస్తుంది. కాలేజీ స్టూడెంట్‌గా అతుల్య నటిస్తుండగా, కిరణ్‌తో రొమాంటిక్ సీన్స్ చాలానే ఉన్నట్లుగా మనకు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఈ సినిమాలో డైలాగులు కూడా బాగానే పేలనున్నాయి. ఇక యాక్షన్ డోస్ పెంచేసిన కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో హిట్టు అందుకోవడం ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రమేష్ కాడూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.