Kiran Abbavaram : పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నా.. కిరణ్ అబ్బవరం!
మీటర్ (Meter) మూవీ ప్రమోషన్స్ లో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) సినిమా గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

Kiran Abbavaram is planning multistarrer with Pawan Kalyan
Kiran Abbavaram : టాలీవుడ్ లో ఇటీవల కాలంలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) పేరు గట్టిగా వినిపిస్తుంది. షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి బడా నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తాజాగా ఈ హీరో ‘మీటర్’ (Meter) అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక తన సినిమా ప్రమోషన్స్ విషయాలు దగ్గర ఉండి చూసుకొనే కిరణ్.. మీటర్ ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చేస్తున్నాడు.
ప్రధాన సిటీస్ లోని కాలేజీలకు వెళ్లి యూత్ లో ఈ మూవీ పై బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఒక కాలేజీలో స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యిన కిరణ్ అబ్బవరం.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఆ కార్యక్రమంలో కిరణ్ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ గారితో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా. అంతా అనుకున్నట్లు జరిగితే ఒక మల్టీస్టారర్ తో మీ ముందుకు వస్తా’ అంటూ వెల్లడించాడు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుందా? లేదా కిరణ్ అబ్బవరం మాటలు వారికే పరిమితం అయిపోతుందా? అనేది చూడాలి.
Pawan Kalyan: దసరాకు వీరమల్లు.. పొంగల్పై కూడా కన్నేసిన ఉస్తాద్..?
ఇక మీటర్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో కిరణ్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. రమేష్ కాడూరి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళ భామ అతుల్య రవి (Athulya Ravi) హీరోయిన్ గా నటిస్తుంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకి ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు.