Kiran Abbavaram: ఓటీటీలో ఎంట్రీ ఇస్తోన్న కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ఎప్పుడంటే..?
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘మీటర్’ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Kiran Abbavaram Meter Movie Locks OTT Release Date
Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రీసెంట్ మూవీ ‘మీటర్’ మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న కిరణ్ అబ్బవరం, మీటర్ మూవీతో కూడా అదే మ్యాజిక్ కంటిన్యూ చేయాలని చూశాడు. ఇక ఈ సినిమాలో తొలిసారి పోలీస్ పాత్రలో నటించాడు ఈ యంగ్ హీరో.
Kiran Abbavaram : పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నా.. కిరణ్ అబ్బవరం!
అయితే, ఈ సినిమాకు రిలీజ్ రోజున మిక్సిడ్ టాక్ రావడంతో, ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఫలితంగా మీటర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమాను రమేష్ కడూరి డైరెక్ట్ చేయగా, పక్కా కమర్షియల్ అంశాలతో మీటర్ మూవీని చిత్ర యూనిట్ రూపొందించింది. అయితే, ఈ సినిమాను థియేటర్లలో చూడని వారికి గుడ్ న్యూస్‌ను ఇస్తోంది చిత్ర యూనిట్.
Kiran Abbavaram : మళ్ళీ ఇంకో సినిమా.. ఇంత ఫాస్ట్ ఏంటి బాబు.. సూపర్ ఫాస్ట్ కిరణ్ అబ్బవరం..
మీటర్ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. మే 5న మీటర్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో అందాల భామ అతుల్య రవి హీరోయిన్‌గా నటించగా, సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. మరి మీటర్ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందో చూడాలి.

Kiran Abbavaram Meter Movie Locks OTT Release Date