Vinaro Bhagyamu Vishnu Katha Trailer : ఫోన్ నెంబర్ నైబర్ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో ‘వినరో భాగ్యం విష్ణు కథ’.. ట్రైలర్ అదుర్స్!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'వినరో భాగ్యం విష్ణు కథ'. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ట్రైలర్ ని లాంచ్ చేశాడు. ట్రైలర్ మొత్తం చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. ఫోన్ నెంబర్ నైబర్...

Vinaro Bhagyamu Vishnu Katha Trailer : ఫోన్ నెంబర్ నైబర్ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో ‘వినరో భాగ్యం విష్ణు కథ’.. ట్రైలర్ అదుర్స్!

Vinaro Bhagyamu Vishnu Katha Trailer

Vinaro Bhagyamu Vishnu Katha Trailer : టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘వినరో భాగ్యం విష్ణు కథ’. క్లాసికల్ టైటిల్ ని పెట్టుకొని ఒక డిఫరెంట్ జోనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ హీరో. ఇప్పటి వరకు ఎక్కువ ప్రేమ కథలతో ఆడియన్స్ ని అలరించిన ఈ యువ హీరో.. ఈసారి లవ్, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్నిటిని కలిపి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సిద్దమవుతున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయ్యిన ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి టీజర్ వరకు సినిమా పై అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇక రిలీజ్ అయిన సాంగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

Kiran Abbavaram : నన్ను ఇండస్ట్రీ నుంచి పంపిచేద్దాం అనుకుంటున్నారు.. కిరణ్ అబ్బవరం!

తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ట్రైలర్ ని లాంచ్ చేశాడు. ట్రైలర్ మొత్తం చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. ఫోన్ నెంబర్ నైబర్ అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ స్టోరీని డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు. మన ఫోన్ నెంబర్ లో లాస్ట్ డిజిట్ కి అటు పక్క ఒక నెంబర్, ఇటు పక్క ఒక నెంబర్ ఉంటుంది కదా. అలా హీరోయిన్ తన నెంబర్ కి ఉన్న నైబర్ నంబర్స్ ని కాంటాక్ట్ అవుతుంది. అందులో ఒక నెంబర్ హీరో కిరణ్ అబ్బవరంది, మరో నెంబర్ మురళీశర్మది. ఈ ముగ్గురు మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు ఆడియన్స్ ని అలరించేలా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక హీరోయిన్ లాగానే, హీరో నెంబర్ కి కూడా నైబర్ నంబర్స్ ఉంటాయి కదా. వాటిలో ఒక నెంబర్ హీరోయిన్‌ది అయితే, మరో నెంబర్ విలన్‌ది. ఇలా నైబర్ నంబర్స్ ని కాంటాక్ట్ అవ్వడం వల్ల హీరో, హీరోయిన్ అనుకోని ప్రమాదంలో పడతారు. దాని నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేదే మిగిలిన కథ అని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇటీవల టీజర్ లో చెప్పినట్లు ఈ సినిమాలో లవ్, కామెడీ, క్రైమ్, సస్పెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 17న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా కాశ్మీర నటిస్తుంది. మురళి శర్మ, శుభలేఖ సుధాకర్, ప్రవీణ్, పమ్మి సాయి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కొత్త దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ టైం కిరణ్ అబ్బవరం గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో తన కెరీర్ ని మలుపు తిప్పే హిట్టుని అందుకుంటాడా అనేది చూడాలి.