Unstoppable episode 4 : బాలయ్య ‘అన్‌స్టాపబుల్’లో మూడు రాజధానులపై తన అభిప్రాయాన్ని తెలియజేసిన కిరణ్ కుమార్ రెడ్డి..

బాలయ్య 'అన్‌స్టాపబుల్' నాలుగో ఎపిసోడ్ గెస్ట్‌లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటి తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఈ షోలో పలు రాజకీయ అంశాలు చర్చకు రాగా.. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు కిరణ్ కుమార్ రెడ్డి.

Unstoppable episode 4 : బాలయ్య ‘అన్‌స్టాపబుల్’లో మూడు రాజధానులపై తన అభిప్రాయాన్ని తెలియజేసిన కిరణ్ కుమార్ రెడ్డి..

Kiran Kumar Reddy comments on Andhra Pradesh three capitals

Unstoppable episode 4 : నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇక రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేసి సంచలనం సృష్టించారు. తాజాగా నాలుగో ఎపిసోడ్ లో బాలయ్య తన పాత స్నేహితులతో కలిసి సందడి చేశాడు.

Unstoppable episode 4 : చిరంజీవిలో నచ్చనిది ఏంటి.. బాలయ్యలో నచ్చేది ఏంటి.. రాధిక జవాబు!

ఈ ఎపిసోడ్ కి అతిథిలుగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటి తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఈ షోలో పలు రాజకీయ అంశాలు చర్చకు రాగా.. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు కిరణ్ కుమార్ రెడ్డి. “ఒకప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ప్రస్తుతం అన్ని దగ్గర ఉండడమే అవసరం” అని వ్యాఖ్యానించాడు.

“లీడర్స్ అంతా తప్పకుండా లెజిస్లేటివ్ క్యాపిటల్ లో, ఆఫీసర్స్ అంతా ఎక్సిక్యూటివ్ క్యాపిటల్ లో ఉండాలి. అయితే కోర్ట్ లో ఏదైనా ఫైల్ చేయాలంటే.. ఆఫీసర్స్ కి మినిస్టర్స్ అండ్ సీఎం అనుమతి కావాల్సిందే. మనకి ఎప్పుడు కూడా అనుకూలత అనేది ముఖ్యం. కాబట్టి మూడు కలిసుంటేనే మంచిది” అంటూ కిరణ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.