Kirti Kulhari : అలాంటి సీన్స్ చేయడానికి నాకు నా మాజీ భర్త సహాయపడ్డాడు.. కీర్తి కుల్హారి!

కీర్తి కుల్హారి.. బాలీవుడ్ పరిశ్రమలో సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. పింక్, ఉరి-ది సర్జికల్ స్ట్రైక్, మిషన్ మంగళ్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమయ్యే 'ఫోర్ మోర్ షాట్స్' సిరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ నటించి టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది. కాగా ఈ సిరీస్ లో అలాంటి సీన్స్ చేయడానికి...

Kirti Kulhari : అలాంటి సీన్స్ చేయడానికి నాకు నా మాజీ భర్త సహాయపడ్డాడు.. కీర్తి కుల్హారి!

Kirti Kulhari : కీర్తి కుల్హారి.. బాలీవుడ్ పరిశ్రమలో సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. పింక్, ఉరి-ది సర్జికల్ స్ట్రైక్, మిషన్ మంగళ్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హనుమాన్, క్రిమినల్ జస్టిస్ వంటి సక్సెస్ ఫుల్ సిరీస్ లో నటించింది. ఇక అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమయ్యే ‘ఫోర్ మోర్ షాట్స్’ సిరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ నటించి టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది.

Kantha Rao : ఎన్టీఆర్ ఏ‌ఎన్‌ఆర్ ఇండస్ట్రీకి రెండు కళ్ళైతే.. కాంతారావు వాటి మధ్య తిలకం వంటివారు.. ‘కాంతారావు’ శతజయంతి వేడుకలు..

ఇప్పటికే మూడు సీజన్లు పూర్తీ చేసుకున్న ఈ ‘ఫోర్ మోర్ షాట్స్’ సిరీస్ లో కీర్తితో పాటు సయానీ గుప్తా, బని జె మరియు మాన్వి గాగ్రూ ప్రధాన పాత్రలో నటించారు. రంగిత ప్రితీష్ నంది మరియు ఇషితా ప్రితీష్ నంది రూపొందించిన ఈ షోలో.. కీర్తి సెక్స్ సీన్స్ చేయడానికి తన మాజీ భర్త ప్రోత్సాహమే కారణమంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

కీర్తి కుల్హారి, సాహిల్ సెహగల్ 2016లో పెళ్లి చేసుకున్నారు. గత సంవత్సరం ప్రారంభంలో ఆమె సాహిల్ తో విడిపోతున్నట్లు ప్రకటించింది. అయితే షోలో ఆ సీన్స్ చేయడానికి నేను ఇబ్బంది పడుతుంటే, సాహిల్.. “అభద్రతాభావంతో నటిస్తే, సినిమాలోని క్యారెక్టెర్ కి న్యాయం చేయలేము. క్యారెక్టర్‌కి ఏం కావాలో అది మనం చేయాలి” అంటూ చెప్పిన మాటలు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి అని వెల్లడించింది. కాగా ఈ సిరీస్ లోని నాలుగో సీజన్ త్వరలోనే విడుదల చేయబోతున్నారు.