Kollywood Heroes : టాలీవుడ్‌లో తమిళ హీరోలు..

తమిళ్ హీరోలు.. తెలుగు దర్శకులను సెర్చ్ చేస్తుంటే, తమిళ్ డైరెక్టర్స్.. తెలుగు హీరోలను వెతుక్కుంటున్నారు..

Kollywood Heroes : టాలీవుడ్‌లో తమిళ హీరోలు..

Kollywood Heroes

Kollywood Heroes: పాన్ ఇండియా స్టేటస్ రావాలంటే ఓ స్ట్రైట్ తెలుగు మూవీ చేయాల్సిందే అంటున్నారు తమిళ్ స్టార్స్. అందుకే ఇప్పుడు టాలీవుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది కోలీవుడ్. తమిళ్ హీరోలు.. తెలుగు దర్శకులను సెర్చ్ చేస్తుంటే, తమిళ్ డైరెక్టర్స్.. తెలుగు హీరోలను వెతుక్కుంటున్నారు. విజయ్ తర్వాత మేము సైతం అంటూ వస్తున్న స్టార్స్ ఎవరో చూద్దాం.

టాలీవుడ్ స్ట్రైట్ ఎంట్రీ ఇచ్చేందుకు లీడ్ తీసుకున్నారు దళపతి విజయ్. తమిళ్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న విజయ్‌కు డైరెక్ట్ తెలుగు సినిమా చేసేందుకు ఇన్నేళ్లు పట్టింది. పాన్ ఇండియా వేదికపై తెలుగు హీరోల స్టార్‌డమ్ చూసి విజయ్‌తో పాటు దాదాపు తమిళ్ హీరోలందరూ తెలుగు వారిలా మారేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దిల్ రాజు – వంశీ పైడిపల్లి కలయికలో విజయ్ ఓ సినిమాకు కమిట్ అవ్వగానే.. అటు ధనుష్ సైతం శేఖర్ కమ్ములతో ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు.

Dhanush – Venky Atluri : తెలుగుపై ఫోకస్.. వెంకీతో ధనుష్..

శేఖర్ కమ్ములతో సినిమా అయితే అనౌన్స్ చేసాడు కానీ అంతకన్నా ముందే మరో తెలుగు డైరెక్టర్‌కి కమిట్‌మెంట్ ఇచ్చేలా ఉన్నారు ధనుష్. ఈ హీరోతో తెలుగు సినిమా చేసేందుకు వెంకీ అట్లూరి – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ‘సాహో’ సుజిత్ – మైత్రీ మూవీ మేకర్స్.. వంటి కాంబోస్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు టాలీవుడ్‌లో ‘బంగారు కుటుంబం’, ‘9నెలలు’ వంటి సినిమాలతో గుర్తింపుతెచ్చుకున్న విక్రమ్ మళ్లీ 20 ఏళ్లకు ఓ స్ట్రైట్ తెలుగు మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ తెలుగు, తమిళ్ భాషల్లో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేసారు.

అన్నదమ్ములు సూర్య, కార్తీ కూడా డైరెక్ట్ టీటౌన్ ప్రాజెక్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘రక్తచరిత్ర 2’తో సూర్య, ‘ఊపిరి’ తో కార్తీ ఇదివరకే తెలుగు సినిమాలు చేశారు. అయితే ఇప్పటి ట్రెండ్‌ని పాటిస్తూ కొత్తగా మేముసైతం అంటున్నారు. బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ వంటి డైరెక్టర్స్‌తో సూర్య సంప్రదింపులు జరిపినట్టు వార్తలొచ్చాయి. అయితే త్వరలో త్రివిక్రమ్ – సూర్య కాంబో పట్టాలెక్కినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరోవైపు కార్తీ కూడా ఓ తెలుగు డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టే పనిలో ఉన్నారు.