వెంకీమామ నుండి తప్పుకున్న కోనా వెంకట్!

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 11:36 AM IST
వెంకీమామ నుండి తప్పుకున్న కోనా వెంకట్!

విక్టరీ వెంకటేష్ , నాగ చైతన్య ల మల్టీ స్టారర్ వెంకీమామ ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ ఇద్దరి పాత్రలను బాబీ చాలా వైవిధ్యభరితంగా మలిచాడట. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు. ఇటీవలే రాజమండ్రిలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 8వ తేదీ నుంచి ప్లాన్ చేశారు.

ఈ సినిమా ప్రారంభానికి ముందు వరకు ఈ చిత్రాన్ని సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ , కోన వెంకట్ కలిసి నిర్మించనున్నారని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లు గానే సినిమా లాంచింగ్ కు కూడా హాజరైయ్యాడు కోనా వెంకట్. ఆ తరువాత ట్విట్టర్ ద్వారా పలు సార్లు ఈచిత్రం గురించి అప్డేట్స్ కూడా ఇచ్చాడు. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా యొక్క టైటిల్ పోస్టర్ ను రివీల్ చేసింది. ఈ పోస్టర్ లో కోనా పేరు ఎక్కడా కనిపించలేదు. దాంతో ఈ చిత్రం నుండి కోనా తప్పుకున్నాడని నిర్ధారణ అయ్యింది.