Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

పురం సినిమా మరియు అభిమాన థియేటర్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘కొంచెం హట్కే’ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కూడా కొంచెం హట్కేగా....

Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

Konchem Hatke Movie First Look Poster Release

Konchem Hatke: పురం సినిమా మరియు అభిమాన థియేటర్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘కొంచెం హట్కే’ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కూడా కొంచెం హట్కేగా జరిగింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఈ పోస్టర్ లాంఛ్ వేడుకను ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా చిత్ర దర్శకుడు అవినాష్ కుమార్ మాట్లాడుతూ..‘‘సినీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రతి సినీ ప్రేక్షకుడిని అలరిస్తుందని.. సినిమాలోని ప్రధాన పాత్రల వ్యక్తిగత జీవితాలు, వారి సినీ జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి.. అదే విధంగా సినీ జీవితం వల్ల వ్యక్తిగత జీవితాలు ఎలా తారుమారు అయ్యాయనే అంశాన్ని చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం’’ అని అన్నారు.

ఇక ఈ తరహా కధనం ఇటీవల కాలంలో రాలేదని.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రీకరించామంటూ దర్శకుడు చెప్పుకొచ్చారు. కాగా, ఈ చిత్ర సహనిర్మాత వాసు మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ట్యాలెంటెడ్ మరియు కొత్త టీంని ప్రోత్సహించినందుకు నిర్మాతగా గర్వపడుతున్నాను’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ హాజరై ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ వేడుకను సక్సెస్ చేశారు.

ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌కు వచ్చిన అతిథులకి, మీడియా మిత్రులకి చిత్ర టీం సభ్యులు వినూత్నంగా మొక్కలని అందించి, వారి యొక్క సామాజిక స్పృహని సైతం తెలియపరిచారు. ఈ సినిమాలో ఐశ్వర్య, గురుచరణ్, కృష్ణమంజుష, కృష్ణ, షరీఫ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా, కృష్ణ రావూరి మాటలు అందించారు. ఇక సినిమాటోగ్రఫీ పనులను అనిల్ మల్లెల చూసుకోగా, ఎడిటింగ్‌ను మంజు రెడ్డి అందించారు. ఈ సినిమాను ఆగస్టు చివరి వారంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.