#NTR30: కొరటాల సినిమా.. మళ్ళీ స్టైలిష్‌గా మారనున్న తారక్!

ఒకప్పుడు తెలుగు హీరోలు.. ఇప్పుడు మన స్టార్ హీరోలు వేరు.. సినిమా సినిమాకి మేకోవర్ మారుతుంది.. కథల ఎంపికలో ఏదో ఒక గమ్మత్తు ఉంటుంది. కుదిరితే పాన్ ఇండియా.. లేదంటే కనీసం రెండు భాషల్లో అయినా బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే. అలా ఒక్కో హీరో ఒక్కో రేంజ్ లో ప్లానింగ్ ఉంటుంది.

#NTR30: కొరటాల సినిమా.. మళ్ళీ స్టైలిష్‌గా మారనున్న తారక్!

#ntr30

#NTR30: ఒకప్పుడు తెలుగు హీరోలు.. ఇప్పుడు మన స్టార్ హీరోలు వేరు.. సినిమా సినిమాకి మేకోవర్ మారుతుంది.. కథల ఎంపికలో ఏదో ఒక గమ్మత్తు ఉంటుంది. కుదిరితే పాన్ ఇండియా.. లేదంటే కనీసం రెండు భాషల్లో అయినా బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే. అలా ఒక్కో హీరో ఒక్కో రేంజ్ లో ప్లానింగ్ ఉంటుంది. వీరిలో ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పనిలో ఉండగా ఈ సినిమా అనంతరం.. కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ దర్శకులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్ చేసుకున్నాడు.

ఇందులో కొరటాల సినిమా ముందుగానే మొదలు కానుంది. ఇప్పటికే పూజ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే పట్టాలెక్కనుంది. కాగా, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మరోసారి స్టైలిష్ లుక్ లోకి మారనున్నట్లుగా తెలుస్తుంది. అరవింద సమేత సినిమా అనంతరం ఆర్ఆర్ఆర్ భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ కాస్త బరువు పెరిగినట్లు కనిపిస్తుంది. ఆహార్యంలో గంభీరంగా కనిపించేందుకు రాజమౌళి సూచనల మేరకు ఎన్టీఆర్ అలా తయారయ్యాడు.

అయితే.. కొరటాల శివ సినిమా కోసం మరోసారి స్టైలిష్ గా మారనున్నాడట. ఆర్ఆర్ఆర్ పూర్తికాగానే ఎన్టీఆర్ ఈ మేకోవర్ మీద దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆదివాసీ బిడ్డగా మారిన తారక్.. కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ మోడ్రన్ లుక్ లోకి మారాల్సి ఉంటుంది. ముందుగా స్పెషల్ డైట్ ప్లాన్ తో మొదలుపెట్టనున్న తారక్ కాస్త సన్నబడి సరికొత్తగా మారనున్నాడట. ఇప్పటికే జనతా గ్యారేజ్ లో తారక్ ను కొరటాల నేచర్ అంత సింపుల్ గా చూపించగా ఇప్పుడు ఎలా చూపిస్తాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.