NTR30-NTR31: కొరటాల-ఎన్టీఆర్-ప్రశాంత్.. ఫస్ట్ లుక్‌తోనే ప్రకంపనలు!
కింగ్ ఆఫ్ ఎలివేషన్ ప్రశాంత్ నీల్..కింగ్ ఆఫ్ ఎమోషన్స్ కొరటాల శివ.. కింగ్ ఆఫ్ ఎనర్జీ ఎన్టీఆర్, తారక్ అంటేనే మాస్.. అంతకన్నా రెండు ఊరమాస్ సినిమాలతో రాబోతున్నాడు.. ప్రకటించిన రెండూ పెద్ద ప్రాజెక్టులే.. వినిపించిన డైలాగూ అల్ట్రా మాస్.. ఇంకా కత్తులూ, గొడ్డళ్లు రక్తం, మట్టి, సముద్రం..

NTR30-NTR31: కింగ్ ఆఫ్ ఎలివేషన్ ప్రశాంత్ నీల్..కింగ్ ఆఫ్ ఎమోషన్స్ కొరటాల శివ.. కింగ్ ఆఫ్ ఎనర్జీ ఎన్టీఆర్, తారక్ అంటేనే మాస్.. అంతకన్నా రెండు ఊరమాస్ సినిమాలతో రాబోతున్నాడు.. ప్రకటించిన రెండూ పెద్ద ప్రాజెక్టులే.. వినిపించిన డైలాగూ అల్ట్రా మాస్.. ఇంకా కత్తులూ, గొడ్డళ్లు రక్తం, మట్టి, సముద్రం.. ఇలాంటి ఎలిమెంట్స్ చూపించి ప్రిలుక్, ఫస్ట్ లుక్ తో ప్రకంపనాలు రేపుతున్నాడు.. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేసి, ప్రభంజనం సృష్టించబోతున్నాడా?
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఊరమాస్ హీరో ఎన్టీఆర్ ఇద్దరూ కేజిఎఫ్ 2, ట్రిపుల్ ఆర్… వేరు వేరు సినిమాలతో పాన్ ఇండియా లెవల్ లో బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల సునామి సృష్టించారు. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలాంటి ప్రభంజనాలు సృష్టించబడుతాయో అని తారక్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. సరిగ్గా తారక్ బర్త్ డే రోజున ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి, ఊహల్లో తేలిపోయిన ఫ్యాన్స్ ని, పూనకాలతో ఊగిపోయేలా చేశారు. కేజిఎఫ్ ఫ్రాంచైజీ అనౌన్స్ కావడంతో ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ సినిమా ఇప్పుడప్పుడే ఉండదనుకున్నారు అంతా.. అనూహ్యంగా ఎన్టీఆర్ 31 అల్ట్రామాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి, పాన్ ఇండియా ఆడియన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మైత్రీ మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్.
NTR30: తారక్ ఫ్యాన్స్ సంబరాలు.. రెట్టింపు చేసిన కొరటాల!
టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు తారక్… యస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ పైన ఫ్యాన్స్ కే కాదు, ఆడియన్స్ కూ ఆసక్తి పెరిగింది. ఆయన నుంచి ఆప్ డేట్ కోసం ఆకలిగా ఎదురు చూస్తున్న వాళ్లకు బర్త్ డే సర్ ప్రైజ్ అందించారు యంగ్ టైగర్ … ఎన్టీఆర్ తర్వాత చేయబోయే సినిమా కాదు, సినిమాలు ఒకటి కాదు, బ్యాక్ టు బ్యాక్ రెండు చేస్తున్నట్టు రివీల్ చేసేశారు.. తారక్ బర్త్ డేకి ఒకరోజు ముందే కొరటాల శివతో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ప్రిలుక్ టీజర్ అందించి, తారక్ అభిమానులకు బర్త్ డే సెలబ్రేషన్ కిక్ ఇచ్చారు.. సముద్రం పక్కన జోరు వానలో రక్తం తడిసిన కత్తిని చూపించి ఎన్టఆర్ ఫ్యాన్స్ ను హోరెత్తించారు.
NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ లేట్ గా అయినా లేటెస్ట్ గా వస్తున్నా అని హింట్ ఇచ్చినట్టే ఉంది వరుస సినిమాల అప్ డేట్ చూస్తుంటే. జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ఎన్టీఆర్ 30. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ తో కలసి ఎన్టీఆర్ ఆర్ట్స్ పైన కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ తో కలసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన కళ్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వామిగా ఉండటం విశేషం.
NTR31: బ్లాక్ ఫాంటసీతో హోరెత్తిస్తున్న ప్రశాంత్ నీల్!
ఎక్స్ పెక్టేషన్స్ కి ఏమాత్రమూ తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ రెండు సినిమా చేయబోతున్నట్టు ప్రిలుక్, ఫస్ట్ లుక్ ల తోనే ఆడియన్స్ ను ప్రిపేర్ చేస్తున్నారు కొరటాల శివ, ప్రశాంత్ నీల్… కొరటాల శివ సినిమా నెక్ట్స్ మంత్ నుంచి సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 23 నుంచి రెగ్యులర్ షూట్ జరగబోతుంది అంటున్నారు. మొత్తానికి నందమూరి ఫ్యాన్స్ కు బర్త్ డే డబుల్ ట్రీట్ ఇచ్చారు ఎన్టీఆర్.. ఈ సినిమాలతో పాన్ లెవల్ లో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించడం ఖాయం అని పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
- NTR-Mahesh-Bunny : రిలాక్స్ మోడ్‌లో ఈ ముగ్గురు స్టార్ హీరోలు.. సినిమాలు ఎప్పుడు మొదలుపెడతారు??
- N.V.Ramana: జనం నాడి తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్: జస్టిస్ ఎన్వీ రమణ
- NTR30: ప్లాన్ రెడీ అంటోన్న కొరటాల!
- NTR31: ఎన్టీఆర్ మళ్లీ అలా కనిపిస్తాడా?
- RRR : ‘ఆర్ఆర్ఆర్’ గే సినిమానా?? వాళ్ళకి ఇలా అర్థమైందా?? ఆర్జీవీ చెప్పింది నిజమేనా??
1Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
2New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
3IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కి వరుణుడి ఆటంకం
4Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
5Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం
6Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు
7TS Inetr Results: ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే..
8Assam Floods: అసోం వరదలు.. 127కు చేరిన మృతుల సంఖ్య
9Tragedy : సనత్‌నగర్‌లో దారుణం.. ఇంటి మందున్న చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు
10Bank Holidays: జూలై నెలలో 14రోజులు బ్యాంకులు బంద్.. సెలవులు ఏఏ రోజంటే..
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?