Koratala Siva: ఆచార్య దెబ్బకు తెగ కష్టపడుతోన్న కొరటాల..?

డైరెక్టర్ కొరటాల శివ.. ఈ పేరుకు ఇంట్రొడక్షన్ అవసరం లేదు. రైటర్ నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో తొలి సక్సెస్‌ను అందుకుని,...

Koratala Siva: ఆచార్య దెబ్బకు తెగ కష్టపడుతోన్న కొరటాల..?

Koratala Siva Re Working On Ntr Movie Script

Koratala Siva: డైరెక్టర్ కొరటాల శివ.. ఈ పేరుకు ఇంట్రొడక్షన్ అవసరం లేదు. రైటర్ నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో తొలి సక్సెస్‌ను అందుకుని, అక్కడి నుండి తన సక్సెస్ జర్నీని మొదలుపెట్టాడు. వరుసగా హిట్ సినిమాలు తీస్తూ స్టార్ హీరోలకు బ్లాక్‌బస్టర్ విజయాలను అందిస్తూ వచ్చాడు కొరటాల. కానీ ఇదంతా గతం అంటున్నారు ఇప్పటి ఆడియెన్స్. ఆయన తెరకెక్కించిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేసి ఆయన్ను స్టార్ డైరెక్టర్‌గా మార్చేశాయి.

Koratala Siva: ఆచార్య గుణపాఠం.. కొరటాలకి అగ్ని పరీక్షగా ఎన్టీఆర్ సినిమా!

ఇక ఇలాంటి దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడనే వార్తతోనే ఆచార్య సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో, కొరటాల దద్దరిల్లిపోయే కథను రాసుంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఆచార్య చిత్ర రిలీజ్ రోజునే, కొరటాలకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందని తేలిపోయింది. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఇద్దరూ కూడా ‘ఆచార్య’ ఫ్లాప్‌ను ఆపలేకపోయారు. దీంతో అందరూ కూడా ఈ సినిమా ఫ్లాప్‌కు కొరటాలను పాయింట్ ఔట్ చేస్తూ వచ్చారు. అయితే ఆచార్య ఫ్లాప్‌తో కుంగిపోకుండా, తన ఫెయిల్యూర్‌ను ఛాలెంజ్‌గా తీసుకున్నాడు ఈ స్టార్ డైరెక్టర్.

Koratala Shiva : కాజల్ ని ఆచార్య సినిమాలోంచి తీసేశాం.. ఎందుకంటే??

తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న కొరటాల, ఈసారి ఎలాంటి తప్పుకు తావివ్వకూడదని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో తారక్ కోసం ఓ భారీ కథను రెడీ చేశానని చెప్పుకుంటూ వచ్చిన కొరటాల, ఇప్పుడు ఆ కథపై మళ్లీ రీవర్క్ చేస్తున్నాడట. కథలో బలహీన అంశాలు ఏమిటనేవి పసిగట్టి.. అక్కడ హీరో తాలుకా ఇమేజ్‌కు సరిపడే సీన్స్‌ను యాడ్ చేస్తున్నాడట. మొత్తానికి ఆచార్య దెబ్బకు కొరటాల చాలా గట్టిగానే కష్టపడుతున్నాడనేది క్లారిఫై అయ్యింది. మరి ఆచార్య ఫెయిల్యూర్‌తో తనపై నిందలు వేసిన వారికి.. కొరటాల ఎన్టీఆర్ 30వ చిత్రంతో ఎలాంటి యాన్సర్ ఇస్తాడో చూడాలి.