కోటా శ్రీనివాసరావుకు అవమానం: కృష్ణగారైతే ఇలా చేసేవారా?

తెలుగుతెరపై దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావుకు అవమానం జరిగింది. పరాయి భాష నటుల దిగుబడిని తగ్గించమంటూ  కోటా శ్రీనివాసరావు మాట్లాడుతుండగా 'మా' అధ్యక్షుడు నరేష్ చేసిన పనికి ఆయనకు కోపం వచ్చింది.

  • Published By: vamsi ,Published On : March 23, 2019 / 06:55 AM IST
కోటా శ్రీనివాసరావుకు అవమానం: కృష్ణగారైతే ఇలా చేసేవారా?

తెలుగుతెరపై దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావుకు అవమానం జరిగింది. పరాయి భాష నటుల దిగుబడిని తగ్గించమంటూ  కోటా శ్రీనివాసరావు మాట్లాడుతుండగా ‘మా’ అధ్యక్షుడు నరేష్ చేసిన పనికి ఆయనకు కోపం వచ్చింది.

తెలుగుతెరపై దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావుకు అవమానం జరిగింది. పరాయి భాష నటుల దిగుబడిని తగ్గించమంటూ  కోటా శ్రీనివాసరావు మాట్లాడుతుండగా ‘మా’ అధ్యక్షుడు నరేష్ చేసిన పనికి ఆయనకు కోపం వచ్చింది. అసలు విషయం ఏమిటంటే.. మా అధ్య‌క్ష ప్ర‌మాణ స్వీకారం కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు మాట్లాడాడు. ఆయ‌న తెలుగు న‌టులు, వాళ్ల గొప్ప‌త‌నం గురించి మాట్లాడుతూ.. ప‌రాయి భాషా న‌టుల‌కు ల‌క్ష‌లు ఇచ్చి ఎందుకు అవకాశం ఇస్తున్నారంటూ విమ‌ర్శిస్తున్నాడు.
Read Also : వైసీపీ షాకింగ్ డెసిషన్ : హిందూపురం బరిలో గోరంట్ల మాధవ్ భార్య

అమితాబ్ లాంటి వాళ్ల‌ను తీసుకొస్తే స‌మ‌స్య లేదు కానీ షాయాజీ షిండే లాంటి వాళ్ల‌ను తీసుకొచ్చి అంద‌ల‌మెక్కిస్తుంటే కోప‌మొస్తుంది అంటూ కోట మాట్లాడుతుంటూ దగ్గరకు వచ్చిన న‌రేష్ త్వ‌ర‌గా స్పీచ్ ముగించాలంటూ చెవిలో చెప్పాడు. దాంతో ఫీల్ అయిన కోట ప్ర‌మాణ స్వీకారానికి టైమ్ అవుతుందంట‌.. న‌న్ను త్వ‌ర‌గా ముగించమంటున్నారు. తెలుగు వాళ్ల గురించి మాట్లాడుతున్నాను క‌దా? ఎవ‌రికీ న‌చ్చ‌దులే! ఎక్కువ సేపు మాట్లాడినందుకు న‌న్ను క్ష‌మించండి.  అదే కృష్ణ గారు మాట్లాడుతుంటే మైక్ తీసుకుంటారా అంటూ ప్ర‌శ్నించాడు కోట. అనంతరం మైక్ ఇచ్చేసి స్టేజి దిగేశాడు. 
Read Also : ఎన్నికలకు మరో ఇరవై రోజులే : మేనిఫెస్టో రిలీజ్ చేయని టీడీపీ, వైసీపీ