Nagababu : నాగబాబుకి కౌంటర్ వేసిన ‘కోటా’.. చిరంజీవి లేకపోతే నాగబాబు ఎవరో కూడా తెలీదు..

తనపై తీవ్ర విమర్శలు చేసిన నాగబాబుకి గట్టి కౌంటర్ వేశారు కోటా శ్రీనివాసరావు. నాగబాబు గురించి కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెగా బ్రదర్ అనే గుర్తింపు తప్ప నాగబాబుకి ఏం గుర్తింపు

10TV Telugu News

Nagababu :  ఇటీవల ‘మా’ ఎలక్షన్స్ వల్ల తెలుగు సినీ పరిశ్రమలో ఆర్టిస్టుల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటకి వచ్చాయి. ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయిందా అనేట్టుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు. ‘మా’ ఎలక్షన్స్ అయిపోయాక కూడా ఈ విమర్శలు ఆగట్లేదు. ‘మా’ ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ గురించి కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అయన షూటింగ్స్ కి లేట్ గా వస్తాడు. అయన ఎలా ‘మా’ అధ్యక్షుడిగా పోటీచేస్తాడు అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసిన నాగబాబు కోట శ్రీనివాస రావు మీద ఫైర్ అయ్యారు. తీవ్రంగా దూషించారు. అప్పుడు కోటా ఏమి మాట్లాడకపోయినా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అందరి వ్యాఖ్యలకి ఘాటుగా రిప్లై ఇచ్చారు.

Prabhas : ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్.. రాధే శ్యామ్ టీజర్.. విక్రమాదిత్య ఎవరు??

తనపై తీవ్ర విమర్శలు చేసిన నాగబాబుకి గట్టి కౌంటర్ వేశారు కోటా శ్రీనివాసరావు. నాగబాబు గురించి కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెగా బ్రదర్ అనే గుర్తింపు తప్ప నాగబాబుకి ఏం గుర్తింపు ఉందని ప్రశ్నించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే ఆయన్ను ఎవరూ పట్టించుకోరు, చిరంజీవి లేకపోతే నాగబాబు ఎవరో కూడా తెలీదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనపై నాగబాబు కామెంట్స్ చేసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదని, నేను కూడా నాగబాబులా నోరు జారి ఉంటే టీవీలో డిబెట్‌లకు ఆ టాపిక్ వచ్చేదని చెప్పారు. ఇప్పుడు కూడా అనవసరంగా ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదని అన్నారు. మరి ఈ వ్యాఖ్యలకి నాగబాబు స్పందిస్తాడో లేదో చూడాలి. అలాగే అనసూయ డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే నిన్న అనసూయ ఘాటుగానే రిప్లై ఇచ్చింది.