ఆహా లో ‘క్రాక్’.. ట్రైలర్ కట్ అదిరిందిగా!

ఆహా లో ‘క్రాక్’.. ట్రైలర్ కట్ అదిరిందిగా!

Krack-on-AHA

Krack on AHA: మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ జంటగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘క్రాక్’.. ‘డాన్ శీను’, ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని రవితేజ కలయికలో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిల్మ్ ఇది..

ఒంగోలులో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు రాసుకున్న కథ, దాన్ని తెరకెక్కించిన విధానంతో పాటు మాస్ మహారాజా ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, రవితేజ భార్యగా ట్విస్ట్‌తో కూడిన శృతి హాసన్ క్యారెక్టర్, కటారి కృష్ణగా సముద్రఖని, జయమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్‌ల నటన, ఫైట్స్, డైలాగ్స్. థమన్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి.

Krack

సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 50 శాతం ఆక్యుపెన్సీ అయినప్పటికీ ఊహించని విధంగా వసూళ్లు సాధించి సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు తెలుగు పాపులర్ ఓటీటీ ఆహాలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. సోమవారం ‘క్రాక్’ కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. మూవీ చూసిన వాళ్లకి కూడా ట్రైలర్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఫిబ్రవరి 5 నుండి ఆహాలో ‘క్రాక్’ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.