Naga Shaurya : వెంకటేష్ కంటే బాగా చూసుకుంటా.. ‘కృష్ణ వ్రింద విహారి’ టీజర్ రిలీజ్..
తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి 'కృష్ణ వ్రింద విహారి' సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్లో..''హీరోయిన్ అందాల్ని చూపిస్తూ...........

Kvv
Krishna Vrinda Vihari : టాలీవుడ్ యువ హీరోల్లో సక్సెస్ కోసం తాపత్రయ పడే హీరో నాగ శౌర్య. ప్రతీసారి కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలు ట్రై చేస్తున్నా విజయాలు మాత్రం అప్పుడప్పుడు పలకరిస్తున్నాయి ఈ హీరోని. కానీ చేతిలో మాత్రం ఎప్పుడూ వరుస ప్రాజెక్టులు ఉంటాయి శౌర్యకి. ప్రస్తుతం తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో నాగ శౌర్య హీరోగా, షెర్లీ సేతియా హీరోయిన్గా ‘కృష్ణ వ్రింద విహారి’ అనే సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.
తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్లో..”హీరోయిన్ అందాల్ని చూపిస్తూ కనిపించి వినిపించకుండా.. వినిపించి కనిపించకుండా.. అంటూ నాగశౌర్య డైలాగ్‌తో మొదలు పెట్టి, హీరో హీరోయిన్స్ మధ్య ఉన్న రొమాన్స్ సన్నివేశాల్ని చూపించి, తర్వాత హీరోయిన్ పట్టించుకోకపోతే హీరో తన వెంట పడటం, చివరగా పెళ్లి చేసుకుందాం సినిమాలో సౌందర్యలా అయినా పర్లేదు వెంకటేష్ కంటే బాగా చూసుకుంటాను” అనే డైలాగ్‌తో టీజర్‌ని ముగించారు.
Varun Tej : మరో కొత్త కాన్సెప్ట్‌తో వరుణ్‌తేజ్.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో
ఈ టీజర్ చూస్తుంటే సినిమా పూర్తి లవ్, రొమాన్స్, కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాని ఏప్రిల్ 22న థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారు. అనీష్ కృష్ణ దీనికి దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమాతో అయినా నాగశౌర్య హిట్ సాధించి తన కష్టానికి ప్రతిఫలం సాధిస్తాడేమో చూడాలి.