Rangamarthanda Review : రంగమార్తాండ.. మన అమ్మానాన్నల కథ.. సినిమా అంతా ఏడిపించేశారు..

కథ అందరి ఇళ్లల్లో జరిగేదే, ప్రస్తుతం సమాజంలో జరిగేదే కానీ కథనాన్ని చాలా ఎమోషనల్ గా తీసుకెళ్లాడు కృష్ణవంశీ. సినిమా చూస్తున్నంతసేపు ప్రతి సన్నివేశంలోనూ కన్నీళ్లు తెప్పించాడు..............

Rangamarthanda Review : రంగమార్తాండ.. మన అమ్మానాన్నల కథ.. సినిమా అంతా ఏడిపించేశారు..

Krishnavamsi Rangamarthanda Movie Review

Rangamarthanda Review :  కృష్ణవంశీ దాదాపు ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాని ఉగాది నాడు మార్చ్ 22న రిలీజ్ చేయగా పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి విజయం సాధించింది. మరాఠీలో మంచి విజయం సాధించిన నటసామ్రాట్ సినిమాని తెలుగులో రంగమార్తాండగా రీమేక్ చేశారు. ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ గా రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ, ఆదర్శ్ ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమానే మాట్లాడుతుంది, ఎమోషనల్ డ్రామా, మన అమ్మానాన్నల కథ అంటూ తక్కువ ప్రమోషన్స్ తోనే ఆసక్తి పెంచారు రంగమార్తాండ సినిమాపై.

కథ విషయానికి వస్తే.. నాటకాలు వేసి, నాటక రంగంలో గొప్పవాడిగా ఎదిగిన రాఘవరావు (ప్రకాష్ రాజ్) కి రంగమార్తాండ అనే బిరుదు ప్రకటించడంతో నాటకాలకు గుడ్ బై చెప్పేసి, ఇంటిని కోడలి పేరు మీద, డబ్బుని కూతురి పేరు మీద రాసి లైఫ్ ని ఫ్యామిలీతో గడపడానికి సిద్దమైపోతాడు. ఇక్కడ్నుంచి చాలా వరకు అందరి ఇళ్లల్లో జరిగే కథలనే చూపించాడు. అత్తమామల పద్ధతులు నచ్చని కోడలు, కూతుర్ని పెళ్లి చేసి పంపించేయడం, కోడలు మాట వినే కొడుకు.. ఇలా అందరి ఇళ్లల్లో ఉండే సమస్యలు చూపించారు. కష్టపడి కట్టుకున్న ఇల్లు కూల్చేసి అపార్ట్మెంట్ కడతామని పేరుతో అత్తమామల్ని ఇంట్లోంచి పంపించేయడం, ఎక్కడికో వెళ్లిపోతుంటే కూతురు వచ్చి తీసుకెళ్లడం, కానీ అక్కడ కూడా కూతురు పలు మాటలు అనడం.. ఇలా మన అమ్మానాన్నలు పెద్దవాలైపోతే మనం పట్టించుకోకుండా దూరం చేసుకుంటే వాళ్ళు ఏమైపోతారు అనే విషయాన్ని ఎమోషనల్ గా చూపించారు. ఇక ప్రకాష్ రాజ్ కి ఫ్రెండ్ పాత్రలో ఎప్పుడూ తన పక్కనే ఉండే బ్రహ్మానందం కనిపించారు.

కథ అందరి ఇళ్లల్లో జరిగేదే, ప్రస్తుతం సమాజంలో జరిగేదే కానీ కథనాన్ని చాలా ఎమోషనల్ గా తీసుకెళ్లాడు కృష్ణవంశీ. సినిమా చూస్తున్నంతసేపు ప్రతి సన్నివేశంలోనూ కన్నీళ్లు తెప్పించాడు. నాటకాలు మానేసి ఖాళీగా భార్య తో ఉన్న ఓ మంచి మనిషి పాత్రలో ప్రకాష్ రాజ్, భర్తే దైవం అనుకునే పాత్రలో రమ్యకృష్ణ, భార్య చాటు భర్తగా కొడుకు పాత్రలో ఆదర్శ్, కోడలిగా అనసూయ, కూతురిగా శివాత్మిక, మంచి అల్లుడిగా రాహుల్ సిప్లిగంజ్ అందరూ ప్రేక్షకులని తమ నటనతో మెప్పించి కంటతడి పెట్టించారు. ముఖ్యంగా సినిమాలో మాట్లాడుకోవాల్సిన పాత్ర బ్రహ్మానందం. ఒక కమెడియన్ గా ఇన్నాళ్లు మనం చూసిన బ్రహ్మానందాన్ని పక్కన పెట్టి ఒక సక్సెస్ అవ్వలేని, డబ్బు సంపాదించలేని నటుడిగా, భార్యని పోగొట్టుకున్న భర్తగా, పిల్లలు లేని అనాధగా, స్నేహితుడిగా సినిమాలో ఉన్నంతసేపు తన నటనతో కన్నీళ్లు తెప్పించాడు. బ్రహ్మానందం చివరి సీన్స్ లో అయితే తాను ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తాడు. ఇన్నాళ్లు బ్రహ్మానందాన్ని చూసి నవ్విన మనమే ఇప్పుడు ఆయన్ని చూసి ఏడుస్తాం ఈ సినిమాలో.

టెక్నికల్ గా ఫస్ట్ హాఫ్ లో కొన్ని మైనస్ లు ఉన్నా కథనం బాగుండటంతో అవి పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. ఇళయరాజా ఇచ్చిన సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఓ పక్క వృద్ధులైన అమ్మానాన్నల కథ చెప్తూనే మరో పక్క నాటకాలు, తెలుగు ప్రాముఖ్యత గురించి అంతే గొప్పగా చెప్పారు. సినిమా చూస్తుంటేనే మన తెలుగు నాటకాలకు సంబంధించి చాలా రీసెర్చ్ చేశారని అర్ధమవుతుంది. కృష్ణవంశీ ఒక హిట్ సినిమా తీశారు అనేకంటే ఒక గొప్ప సినిమా తీశారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు తమ ఫ్యామిలీలతో కలిసి చూడాల్సిన సినిమా.

Shaakuntalam : శాకుంతలం కోసం.. ఏకంగా అన్ని కోట్లు పెట్టి రియల్ నగలా??.. ఒక్క సమంతకే 15 కిలోల బంగారం..

మరాఠి సినిమా రీమేక్ అయినా ఎక్కడా దాని ఛాయలు కనపడకుండా అచ్చ తెలుగులో, తెలుగుతనం ఉట్టిపడేలా తీశారు కృష్ణవంశీ. సినిమా అచుసేటప్పుడే కాదు సినిమా చూసి కచ్చితంగా ఏడ్చుకుంటూ బయటకి వస్తాం. తెలుగు సాహిత్యం, చరిత్రని ఇష్టపడే వాళ్లకి ఈ సినిమా మరింత నచ్చుతుంది. రంగమార్తాండ చూశాక ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. రంగమార్తాండ సినిమా కాదు. సమాజంలో ఇప్పటి అమ్మానాన్నల కథ.