Krithi Shetty : సైలెంట్‌గా హైదరాబాద్‌లో ఫ్యాన్స్ మీట్ పెట్టిన కృతిశెట్టి.. వైరల్ అవుతున్న సెల్ఫీ..

ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలతో బిజీబిజీగా ఉంది కృతి శెట్టి. ఓ పక్క సైకాలజీ చదువుకుంటూనే మరో పక్క సినిమాలు చేస్తూ, ఇంకో పక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది ఈ కుర్ర భామ. ఇక ఈ అమ్మడికి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే ఈమె ఫ్యాన్ పేజీలు ఎక్కువే. తాజాగా కృతి శెట్టి హైదరాబాద్ లో............

Krithi Shetty : సైలెంట్‌గా హైదరాబాద్‌లో ఫ్యాన్స్ మీట్ పెట్టిన కృతిశెట్టి.. వైరల్ అవుతున్న సెల్ఫీ..

Krithi Shetty arranged fans meet in hyderabad

Krithi Shetty :  తెలుగులో ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఆ సినిమా భారీ విజయం సాధించడమే కాక తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన క్యూట్ ఫోటోలు పోస్ట్ చేస్తూనే అభిమానులని పెంచుకుంటుంది కృతి. ఉప్పెన తర్వాత, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడంతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిపోయింది కృతి.

ఆ తర్వాత రెండు సినిమాలు పరాజయం పాలైనా కృతి అవకాశాలు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలతో బిజీబిజీగా ఉంది కృతి శెట్టి. ఓ పక్క సైకాలజీ చదువుకుంటూనే మరో పక్క సినిమాలు చేస్తూ, ఇంకో పక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది ఈ కుర్ర భామ. ఇక ఈ అమ్మడికి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే ఈమె ఫ్యాన్ పేజీలు ఎక్కువే. తాజాగా కృతి శెట్టి హైదరాబాద్ లో సైలెంట్ గా ఎక్కువ ప్రమోషన్ లేకుండా ఫ్యాన్స్ మీట్ పెట్టింది.

Chiranjeevi : తన వాయిస్ తో ప్రత్యేక వీడియో.. వాల్తేరు వీరయ్య విజయాన్ని సినీ కార్మికులకు అంకితమిచ్చిన మెగాస్టార్..

తన ఫ్యాన్ పేజీలు నడిపే వాళ్లందరితో కలిసి కృతి ఈ ఫ్యాన్స్ మీట్ నిర్వహించింది. శనివారం నాడు హైదరాబాద్ లో ఈ ఫ్యాన్ మీట్ లో కృతి పాల్గొంది. తన అభిమానులతో ముచ్చటించి, వారికీ ఫోటోలు ఇచ్చింది. అందరితో కలిసి కృతి ఓ సెల్ఫీ కూడా దిగింది. దీంతో ఆ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెరీర్ మొదట్లోనే ఇలా ఫ్యాన్స్ మీట్స్ పెట్టి ఫ్యాన్స్ ని ఎంకరేజ్ చేస్తుందంటే కెరీర్ మీద చాలా పకడ్బందీగా ఉన్నట్టే అంటున్నారు సినీ వర్గాలు. మొత్తానికి చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిన కృతి అప్పుడే ఫ్యాన్ మీట్స్ కూడా నిర్వహిస్తూ అభిమానులకి మరింత దగ్గరవుతుంది.