Krithi shetty : లైవ్ లో ఏడ్చేసిన కృతిశెట్టి.. ప్రాంక్ చేసి ఏడిపించిన వారిపై నెటిజన్ల ఆగ్రహం..

తమిళ ప్రాంక్ యూట్యూబర్లు ఆశిక్, సారథిరన్ కృతిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ జరుగుతుండగా వీరిద్దరూ బిగ్గరగా అరుస్తూ కృతిశెట్టిని నేను ప్రశ్నలు అడుగుతానంటే, నేను అడుగుతానని ఒకరిపై ఒకరు గొడవకు................

Krithi shetty : లైవ్ లో ఏడ్చేసిన కృతిశెట్టి.. ప్రాంక్ చేసి ఏడిపించిన వారిపై నెటిజన్ల ఆగ్రహం..

Krithishetty

Krithi shetty :  చిన్న ఏజ్ లోనే హీరోయిన్ అయి వరుస హిట్స్ సాధిస్తుంది కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి శ్యామ్ సింగరాయ్ తో అందర్నీ ఆకట్టుకొని బంగార్రాజు సినిమాతో మెప్పించి హ్యాట్రిక్ హిట్ కొట్టింది కృతి. ప్రస్తుతం సుధీర్ బాబు, నితిన్, రామ్, తమిళ్ లో సూర్యతో సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. ఇటీవల ఓ తమిళ్ అవార్డు ఫంక్షన్ లో పాల్గొంది కృతి. ఈ ఫంక్షన్ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో కృతిని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. ఇందుకు తమిళ ప్రాంక్ యూట్యూబర్లు ఆశిక్, సారథిరన్ కృతిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ జరుగుతుండగా వీరిద్దరూ బిగ్గరగా అరుస్తూ కృతిశెట్టిని నేను ప్రశ్నలు అడుగుతానంటే, నేను అడుగుతానని ఒకరిపై ఒకరు గొడవకు దిగారు. హీరోయిన్ ఎదుటే కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో అదంతా ప్రాంక్ అని తెలియక అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక కృతి భయపడింది.

Ananya Nagalla : నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు.. కళ్ళు చెదిరే థైస్‌తో అనన్య నాగళ్ళ

తర్వాత వారు ప్రాంక్ అని చెప్పినా మొదట నవ్వినా ఆపై దుఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది కృతి శెట్టి. దీంతో ఆ ప్రాంక్ కాస్త తప్పుగా వెళ్ళింది. కృతి ఇలా లైవ్ లో ఏడ్చేసరికి కృతి ఫ్యాన్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ప్రాంక్ చేసిన వారిని విమర్శిస్తున్నారు. కృతి కన్నీళ్ళు పెట్టడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.