Krithi Shetty : సైకాలజీ కోర్స్ చేస్తున్నా.. సినిమాల్లో పాత్రలు అర్ధం చేసుకోడానికి కూడా ఉపయోగపడుతుంది..

తన స్టడీ గురించి అడగగా కృతిశెట్టి.. ''ప్రస్తుతం నేను సైకాలజీ చదువుతున్నాను. మనుషుల్ని మాత్రమే కాదు, సినిమాలో పాత్రల్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది కూడా.................

Krithi Shetty : సైకాలజీ కోర్స్ చేస్తున్నా.. సినిమాల్లో పాత్రలు అర్ధం చేసుకోడానికి కూడా ఉపయోగపడుతుంది..

Krithi Shetty doing Psychology Cource

Krithi Shetty :  యాడ్ ఫిలిమ్స్, కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన కృతిశెట్టి ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కృతికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాక వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. కృతిశెట్టి ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఇటీవలే ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో ప్రేక్షకులని పలకరించింది.

ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు, సినిమాల్లో కృతిశెట్టి ఎమోషనల్ యాక్టింగ్ కి అభినందనలు వస్తున్నాయి. సినిమా చూసిన వారంతా కృతిశెట్టిని అభినందిస్తున్నారు. అలాగే డ్యూయల్ రోల్ కూడా కావడంతో ఎక్కువ పర్ఫార్మెన్స్ కి స్కోప్ లభించింది. ఈ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూ నిర్వహించగా కృతిశెట్టి మాట్లాడుతూ ఈ సినిమా గురించి, అలాగే తన స్టడీ గురించి కూడా తెలిపింది.

Senior Actress Jayakumari : సీనియర్ నటి.. 200 పైగా సినిమాలు.. కానీ ఇప్పుడు చికిత్సకి డబ్బుల్లేక ప్రభుత్వాసుపత్రిలో..

కృతిశెట్టి సినిమా గురించి మాట్లాడుతూ.. ”ఈ సినిమా విజయం నాకు చాలా ప్రత్యేకం. నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర ఇది. అందుకే ప్రేక్షకులు కూడా ఆ పాత్రకి బాగా కనెక్ట్‌ అవుతున్నారు. చాలా మంది ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. ఒక నటిగా నాకు సంతృప్తినిచ్చిన పాత్ర ఇది. సినిమా చూసి మా అమ్మ చాలా ఎమోషనల్‌ అయ్యింది. నాన్నకి కూడా చాలా బాగా నచ్చింది. నేను ఈ సినిమా చేయడం వారికి చాలా గర్వంగా అనిపించింది. ఇంత మంచి పాత్రని నాకు ఇచ్చినందుకు దర్శకుడు ఇంద్రగంటికి కృతజ్ఞతలు’’అని తెలిపింది.

ఇక తన స్టడీ గురించి అడగగా కృతిశెట్టి.. ”ప్రస్తుతం నేను సైకాలజీ చదువుతున్నాను. మనుషుల్ని మాత్రమే కాదు, సినిమాలో పాత్రల్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది కూడా తెలుస్తుంది. ఈ కోర్సు నాకు నటనలో హెల్ప్‌ అవుతుందని చేస్తున్నాను” అని తెలిపింది.