Krithi Shetty: లిప్‌లాక్ ఒకే.. బేబమ్మ హద్దులు చెరిపేసిందా?

ఒక్క ఛాన్స్.. ఒక్క హిట్ చాలు రాత్రికి రాత్రే ఫేట్ మారిపోడానికి. మిగతా రంగాల్లో సంగతెలా ఉన్నా సినిమా ఇండస్ట్రీలో మాత్రం సక్సెస్ దాసోహం చేస్తుందని చెప్తారు. కృతి శెట్టి విషయంలో..

Krithi Shetty: లిప్‌లాక్ ఒకే.. బేబమ్మ హద్దులు చెరిపేసిందా?

Krithi Shetty

Krithi Shetty: ఒక్క ఛాన్స్.. ఒక్క హిట్ చాలు రాత్రికి రాత్రే ఫేట్ మారిపోడానికి. మిగతా రంగాల్లో సంగతెలా ఉన్నా సినిమా ఇండస్ట్రీలో మాత్రం సక్సెస్ దాసోహం చేస్తుందని చెప్తారు. కృతి శెట్టి విషయంలో కూడా ఇదే జరిగింది. ఉప్పెన సినిమాతో ఇటు చార్మింగ్ అటు యాక్టింగ్ రెండిటిలో కూడా ఈ కన్నడ భామకి సూపర్ గుడ్ అని గ్రేడ్స్ ఇచ్చేసింది టాలీవుడ్. ఈ సినిమాతోనే కృతి పేరు మారు మ్రోగిపోవటమే కాదు.. సౌత్ లో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలను తనవైపు తిప్పుకుంది.

Telugu Star Hero’s: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న తెలుగు హీరోలు!

ఈ అమ్మడు అభినయానికి, అందానికి మూవీ మేకర్స్ వెతుక్కుంటూ వచ్చి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ బేబమ్మ చేతిలో నాని శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబూ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నాగార్జున-నాగ చైతన్య బంగార్రాజు, రామ్-లింగుస్వామి బైలింగువల్ సినిమాతో పాటు నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలున్నాయి. ఇందులో బంగార్రాజు సినిమా నుండి నాగలక్ష్మి పాత్రను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయగా తాజాగా శ్యామ్ సింగరాయ్ టీజర్ కూడా వదిలిన సంగతి తెలిసిందే.

Heroin’s Social Media: సీనియర్ హీరోయిన్స్‌ను బీట్ చేస్తున్న యంగ్ బ్యూటీస్!

కాగా.. శ్యామ్ సింగరాయ్ టీజర్ లో కృతికి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా చివర్లో నానీకి లిప్ లాక్ ఇచ్చిన సీన్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. ఉప్పెన తర్వాత స్కిన్ షో, రొమాన్స్ సీన్స్, లీక్ లాక్ లకు ఒప్పుకోనని కండిషన్స్ పెడుతుందని ఆమధ్య ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఇలా నానీకి లిప్ లాక్ ఇస్తూ అడ్డం దొరికిపోయింది. మరి ఇది సినిమా ట్రిక్ ఉపయోగించి చేశారా.. లేక నిజంగానే చేశారా అన్నది తెలియదు కానీ బేబమ్మ గతంలో పెట్టుకున్న హద్దులు చెరిపేసిందని.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని డిసైడ్ అయిపోయిందని కొత్త కథనాలు మొదలయ్యాయి.