Krithi Shetty : లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతున్న ఉప్పెన బ్యూటీ

తాజాగా కృతికి ఓ భారీ ఆఫర్ వచ్చింది. మొదటి సినిమానే మెగా కాంపౌండ్ లో చేసింది కృతీ శెట్టి. ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి మరో ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమాకి.....

Krithi Shetty : లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతున్న ఉప్పెన బ్యూటీ

Krithi

Krithi Shetty :  ‘ఉప్పెన’ సినిమాలో తన నటనతో అందర్నీ మెప్పించి తన అందాలతో అందర్నీ అలరించింది కృతి శెట్టి. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో కృతీకి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మొదటి సినిమాలోనే ఓ రేంజ్ లో రొమాన్స్ సన్నివేశాల్లో నటించి తర్వాత సినిమాలకి కూడా బోల్డ్ సీన్స్ కి ఓకే చెప్పడంతో ఈ బ్యూటీ కి ఆఫర్స్ తెగ వచ్చేస్తున్నాయి. దీంతో తన రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేసింది. ఇప్పటికే కృతీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. నానితో ‘శ్యామ్ సింగరాయ్’, నాగ చైతన్యతో ‘బంగార్రాజు’, రామ్ తో ఒక సినిమా ఉన్నాయి. ఇవి కాకుండా మరో సినిమాకి కూడా సైన్ చేసినట్టు సమాచారం.

Samantha : సమంత ఐటెం సాంగ్ రేపే…

తాజాగా కృతికి ఓ భారీ ఆఫర్ వచ్చింది. మొదటి సినిమానే మెగా కాంపౌండ్ లో చేసింది కృతీ శెట్టి. ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి మరో ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమాకి ఓకే చెప్పిందని టాక్‌. స్టార్‌ హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ చేయాలంటేనే ఆలోచిస్తారు. అలాంటిది ఒక్క సినిమాతోనే లేడీ ఓరియెంటెడ్ ఛాన్స్ పట్టేసింది అంటే మామూలు విషయం కాదు. ఆఫర్ రావడంతోనే ఓకే చెప్పిందని సమాచారం.

RRR Trailer : ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పద.. రౌద్రం.. రణం.. రుధిరం..

రాజ్‌తరుణ్‌తో ‘ఉయ్యాల జంపాల’, నానితో ‘మజ్ను’ లాంటి చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ విరించి వర్మ కృతీ శెట్టితో ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయబోతున్నాడు. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత తన సొంత ప్రొడక్షన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు సమాచారం. దీంతో ఈ ‘ఉప్పెన’ భామకి బాగా అదృష్టం ఉన్నట్టు ఉంది అన్ని పెద్ద పెద్ద సినిమాలే ఆఫర్స్ వస్తున్నాయి అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.