Krithi Shetty: విజయ్ దేవరకొండ సినిమాలో బేబమ్మ.. ఖుషి చేసుకుంటున్న ఫ్యాన్స్..?

‘ఉప్పెన’ సినిమాటో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి, ఆ సినిమా అందించిన సక్సెస్‌తో ఒక్కసారిగా టాలీవుడ్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా కృతి శెట్టికి ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలో కృతి శెట్టికి ఛాన్స్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Krithi Shetty: విజయ్ దేవరకొండ సినిమాలో బేబమ్మ.. ఖుషి చేసుకుంటున్న ఫ్యాన్స్..?

Krithi Shetty In Vijay Devarakonda Samantha Khushi Movie

Krithi Shetty: ‘ఉప్పెన’ సినిమాటో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి, ఆ సినిమా అందించిన సక్సెస్‌తో ఒక్కసారిగా టాలీవుడ్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది. అభిమానులు ముద్దుగా ‘బేబమ్మ’ అని పిలుచుకునే కృతి, ఉప్పెన తరువాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చి పడుతుండటంతో ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా కృతి శెట్టి మారిపోయింది.

Krithi Shetty: బాలీవుడ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన బేబమ్మ.. నిజమేనా?

అయితే ఇటీవల ఆమె నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతుండటంతో అమ్మడి క్రేజ్ తగ్గుతుందా అని పలువురు సందేహం వ్యక్తం చేశారు. కానీ, అందులో ఎలాంటి నిజం లేదని.. కృతి శెట్టి కోసం యంగ్ హీరోలు లైన్ కడుతున్నారని ఆమె అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా కృతి శెట్టికి ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలో కృతి శెట్టికి ఛాన్స్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఖుషి’లో విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంత జంటగా నటిస్తున్నారు.

Krithi Shetty : మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన బేబమ్మ.. పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది..

ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కృతి శెట్టికి అవకాశం దక్కిందట. ఈ సినిమాలో ఆమె చేయబోయే పాత్ర కొంచెం నెగెటివ్ షేడ్స్‌ను కలిగి ఉంటుందని.. అయితే చివరికి ఆమె పాత్ర చాలా ఎమోషనల్‌గా మారుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ పాత్రలో కృతి శెట్టి పర్ఫార్మెన్స్ బాగుంటుందని చిత్ర దర్శకుడు శివ నిర్వాణ భావిస్తున్నాడట. అందుకే ఈ పాత్రకు బేబమ్మ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని, ఆమెను ఈ పాత్రలో నటించేందుకు ఒప్పించాడట. మరి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా రాబోతున్న ‘ఖుషి’లో కృతి శెట్టి నిజంగానే నటించనుందా.. అనే విషయం తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.