Krithi Shetty : ‘కస్టడీ’లో రేవతి.. సక్సెస్ అవ్వాల్సిందే..

ప్రస్తుతం కృతిశెట్టి ఆశలన్నీ చైతు - వెంకట్ ప్రభు సినిమా మీదే ఉన్నాయి. ఇంటెన్స్ యాక్షన్ ఎమోషనల్ మూవీగా కనిపిస్తున్న కస్టడీ మూవీలో కృతిశెట్టి నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవలే రేవతిగా కృతి ఫస్ట్ లుక్.................

Krithi Shetty : ‘కస్టడీ’లో రేవతి.. సక్సెస్ అవ్వాల్సిందే..

Krithi shetty must wanted success at this time

Krithi Shetty :  ఉప్పెన సినిమాతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిన కృతి శెట్టి ఎంత స్పీడ్ గా కెరీర్ గ్రాఫ్ పెరిగిందో, ఇప్పుడు డౌన్ ఫాల్ కూడా అంతే స్పీడ్ అవుతుందేమో అనుకుంటున్నారు. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ అందుకున్న కృతి ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపొయింది. ప్రస్తుతం కృతి తెలుగు, తమిళ్, మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

కృతికి ఇప్పుడు సక్సెస్ చాలా అవసరం. ఎందుకంటే 2021లో వరసగా వచ్చిన కృతి సినిమాలన్నీ హిట్ అయ్యాయి. కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన బంగార్రాజు తప్పించి ఏ సినిమా కృతి కెరీర్ కి మైలేజ్ ఇవ్వలేకపోయాయి. రామ్ పోతినేని ఏరికోరి చేసిన కాప్ స్టోరీ ‘ది వారియర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి చెయ్యడంతో ఆ ఫ్లాప్ కృతి అకౌంట్ లో కూడా పడింది. ఇక నితిన్ ఎలాగైనా సక్సెస్ సాధించాలనే పట్టుదలతో చేసిన సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. రొటీన్ కమర్షియల్ సినిమాగా వచ్చిన ఈ సినిమా కూడా కృతి శెట్టి కెరీర్ కి హెల్ప్ అవ్వలేకపోయింది. కృతి శెట్టి నటించిన మరో సినిమా ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్ బాబు హీరోగా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతి కి స్క్రీన్ స్పేస్ ఎక్కువున్నా, కృతి నటనకి ప్రశంసలు వచ్చినా, సినిమాని విమర్శకులు మెచ్చినా కమర్షియల్ గా మాత్రం అంతగా సక్సెస్ కాకపోవడంతో కృతికి ఈ సినిమా కూడా కలిసి రాలేదు. ఇలా వరసగా హ్యాట్రిక్ హిట్ కొట్టి, అంతే స్పీడ్ గా హ్యాట్రిక్ ఫ్లాపుల్ని కూడా చూసిన కృతి ఇప్పుడు ఈ ఫ్లాపుల నుంచి బయటపడాలంటే హిట్ కొట్టి తీరాల్సిందే.

ప్రస్తుతం కృతిశెట్టి ఆశలన్నీ చైతు – వెంకట్ ప్రభు సినిమా మీదే ఉన్నాయి. ఇంటెన్స్ యాక్షన్ ఎమోషనల్ మూవీగా కనిపిస్తున్న కస్టడీ మూవీలో కృతిశెట్టి నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవలే రేవతిగా కృతి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ లో కృతి చాలా ఇంటెన్స్ గా కనిపిస్తోంది. ఇప్పటికే తన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని మెప్పించిన కృతి కస్టడీలో కూడా తన నటనతో మెప్పించబోతుందని అంతా అనుకుంటున్నారు. ఈ సినిమా కమర్షియల్ సినిమాలా కాకుండా కంటెంట్ సినిమాలా అనిపిస్తుండటంతో కృతి ఎలాగైనా ఈ సినిమా హిట్ కొట్టాలి అని భావిస్తున్నారు ఆమె అభిమానులు. ఈ సినిమా హిట్ అయితేనే కృతికి మరిన్ని ఆఫర్లుదక్కే చాన్సుంది. లేకపోతే కృతి కెరీర్ డేంజర్ లో పడ్డట్టే అని అంటున్నారు. అయితే నాగచైతన్యతో బంగార్రాజు తర్వాత సినిమా కావడంతో హిట్ పెయిర్ అని ఆ రకంగా కూడా సినిమా హిట్ అవుతుంది అని భావిస్తున్నారు కొంతమంది.

Rashmika Mandanna : పదేళ్ల తర్వాత వాటినే క్లాసిక్స్ అంటారు.. ఫ్లాప్ సినిమాలని సమర్ధించుకున్న రష్మిక..

సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా తన అభిమానులని మాత్రం బాగా చూసుకుంటుంది కృతి శెట్టి. ఇటీవలే సైలెంట్ గా తన సోషల్ మీడియా ఫ్యాన్ పేజెస్ తో ఫ్యాన్స్ మీట్ కూడా ఏర్పాటుచేసి అభిమానుల్లో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకుంటూ అభిమానులకి ఇంకా దగ్గరవుతుంది .