Krithi Shetty : గోల్డెన్ లెగ్ బేబమ్మ..

వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి.. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మగా మారిపోయింది కృతి శెట్టి..

Krithi Shetty : గోల్డెన్ లెగ్ బేబమ్మ..

Krithi Shetty

Krithi Shetty: ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు హిట్లతో హ్యాట్రిక్ కొట్టేసి టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మగా మారిపోయింది సొట్టబుగ్గల సుందరి కృతి శెట్టి. వరుసగా మూడు క్రేజీ సినిమాలు సూపర్ హిట్ అవడంతో తెలుగు ఇండస్ట్రీలో అమ్మడిది గోల్డెన్ లెగ్ అనేస్తున్నారు సినీ జనాలు.

Bangarraju : రివ్యూ..

తెలుగు సినిమా లవ్ స్టోరీల్లో ట్రెండ్ సెట్ చేసిన ‘ఉప్పెన’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి. ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. బేబమ్మ క్యారెక్టర్‌ని తెలుగు ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకోవడంతో పాటు ఓన్ చేసుకున్నారు కూడా.

Balakrishna : గుర్రమెక్కిన ‘నటసింహం’.. నందమూరి ‘యువసింహం’..

దాంతో కృతికి వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. ఏ సినిమాకి ఓకే చెప్పాలో కూడా తెలియనంతగా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేక కొన్ని సినిమాలు వదులుకుంది కూడా. పాండమిక్ తర్వాత నానితో నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజ్ అయింది. అందులో లిప్ లాక్ కూడా చేసింది పాప.

Krithi Shetty : ‘నాగ లక్ష్మీ’ గా కృతి శెట్టి..

రీసెంట్‌గా నాగ చైతన్యతో నటించిన ‘బంగార్రాజు’ సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్‌బస్టర్ అయింది. చైతన్యతో కృతి కెమిస్ట్రీ బాగా కుదిరింది. ‘ఉప్పెన’ తర్వాత ట్రెడిషనల్ వేర్‌లో కనిపించి అందంగా ఆకట్టుకుంది. సర్పంచ్ నాగలక్ష్మీ క్యారెక్టర్‌కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. వరుసగా మూడు హిట్లు కొట్టేసి మరింత బిజీగా మారిపోయింది కృతి శెట్టి.

Krithi Shetty : పాప ఫుల్ బిజీ.. డేట్స్ ఖాళీ లేవంటున్న కృతి శెట్టి..