Krithi Shetty: మెగా డాటర్‌తో కృతి.. అదీ లేడీ ఓరియెంట్ మూవీ!

ఒక్క హిట్టు పడాలె కానీ క్రేజ్ అమాంతం పెరిగి పోతుందని చెప్పడం మనం వింటూనే ఉంటాం కదా. యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఈ జాబితాలోకే వస్తుందేమో. తొలి సినిమా భారీ సక్సెస్ కొట్టడం..

Krithi Shetty: మెగా డాటర్‌తో కృతి.. అదీ లేడీ ఓరియెంట్ మూవీ!

Krithi Shetty

Krithi Shetty: ఒక్క హిట్టు పడాలె కానీ క్రేజ్ అమాంతం పెరిగి పోతుందని చెప్పడం మనం వింటూనే ఉంటాం కదా. యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఈ జాబితాలోకే వస్తుందేమో. తొలి సినిమా భారీ సక్సెస్ కొట్టడం.. ఏకంగా వంద కోట్ల క్లబ్ సినిమా కావడంతో ఇప్పుడు ఈ చిన్న దానికి వరసపెట్టి యంగ్ హీరోల సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే రామ్, నితిన్, నాగ చైతన్యల సినిమాలతో బిజీగా ఉన్న కృతికి త్వరలోనే మరో క్రేజీ అఫర్ దక్కనుందని టాలీవుడ్ టాక్.

Surrogacy Parents: సరోగసీతో మాతృత్వాన్ని చూస్తున్న బాలీవుడ్!

మెగా డాటర్ సుష్మిత ఇప్పటికే కాస్త్యుమ్ డిజైనర్ గా పనిచేస్తున్న సంగతి చాలా మందికి తెలియదు. అటు తండ్రితో పాటు ఇటు సోదరుడు చరణ్ సినిమాలకు కొన్నిటికి ఆమెనే కాస్ట్యూమ్ డిజైనర్. మరోవైపు నిర్మాణ రంగంలో కూడా రాణించాలని తపనపడుతున్న సుష్మిత ఇప్పటికే ఆమె నిర్మాణంలో వెబ్ సిరీస్ కూడా సిద్ధం చేసింది. కాగా.. త్వరలోనే మెయిన్ స్క్రీన్ మీద కూడా సినిమా నిర్మించేందుకు సిద్దమవుతుంది. ఇందు కోసం ఆమె టీం ఇప్పటికే ఒక కథను కూడా సిద్ధం చేశారట.

Amala Paul: అమలా పాల్ అందాల దాడి..!

లేడీ ఓరియెంటెడ్ కథతో సుష్మిత తొలి సినిమా తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తుండగా అందుకు కృతి శెట్టి అయితే కరెక్ట్ అని భావించడం.. ఇప్పటికే చర్చలు కూడా పూర్తయి కృతి ఒకే చెప్పడం కూడా జరిగిపోయిందని టాక్. ఇదే నిజమైతే కృతికి మరో క్రేజీ ఆఫర్ దక్కినట్లే. ప్రస్తుతం కృతి వయసు 18 ఏళ్ళు. ఇప్పుడే ఒకవైపు స్టార్ హీరోల సినిమాలు.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే అది అందరికీ దక్కే ఛాన్స్ కాదు. అది కూడా మెగా డాటర్ తొలి సినిమా కావడంతో ఆ ఫ్యామిలీ నుండి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఇదే నిజమైతే కృతి లక్కీ గర్ల్ అని చెప్పుకోవాల్సిందే!