Kriti Sanon : తిరుమల శ్రీవారి సేవలో కృతి సనన్, ఆదిపురుష్ యూనిట్..
ప్రభాస్ నిన్న ఉదయమే తిరుమల వెళ్లి సుప్రభాత సేవలో పాల్గొని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక నేడు ఉదయం కృతి సనన్ తో పాటు ఓం రౌత్, నిర్మాత భూషణ్, మరికొంతమంది చిత్రయూనిట్ తిరుమలలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

Kriti Sanon and Adipurush unit visits Tirumala Venkateswara Swami Temple
Tirumala : ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
నిన్న జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు,ప్రేక్షకులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరూ ఊహించనంత గ్రాండ్ గా జరిగింది.
Prabhas : శివ ధనుస్సుని ఎత్తిన ప్రభాస్.. గ్రౌండ్ అంతా దద్దరిల్లిపోయిందిగా..
ప్రభాస్ నిన్న ఉదయమే తిరుమల వెళ్లి సుప్రభాత సేవలో పాల్గొని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రభాస్ పంచెకట్టుతో తిరుమలలో తిరిగిన ఫొటోలు, వీడియోలు నిన్నంతా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నేడు ఉదయం కృతి సనన్ తో పాటు ఓం రౌత్, నిర్మాత భూషణ్, మరికొంతమంది చిత్రయూనిట్ తిరుమలలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని అర్చన సేవలో పాల్గొన్నారు. యూనిట్ అంతా సాంప్రదాయ దుస్తుల్లో తిరుమలను సందర్శించారు. తిరుమల ఆలయం బయట కృతి సనన్, చిత్రయూనిట్ ఫొటోలు దిగగా అవి వైరల్ గా మారాయి.