Prabhas – Kriti Sanon : లవ్ రూమర్స్ పై ప్రభాస్ నన్ను క్వశ్చన్ చేశాడు.. ఇంటర్వ్యూలో కృతిసనన్ కామెంట్స్!

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ కలిసి నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమా గురించి కంటే సోషల్ మీడియాలో ప్రభాస్, కృతి ప్రేమ రూమర్స్ ఎక్కువుగా ట్రెండ్ అయ్యాయి. తాజాగా మరోసారి ఆ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కృతిసనన్.

Prabhas – Kriti Sanon : లవ్ రూమర్స్ పై ప్రభాస్ నన్ను క్వశ్చన్ చేశాడు.. ఇంటర్వ్యూలో కృతిసనన్ కామెంట్స్!

kriti sanon says prabhas is questioning her on love rumours

Prabhas – Kriti Sanon : టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా గురించి కంటే సోషల్ మీడియాలో ప్రభాస్, కృతి ప్రేమ రూమర్స్ ఎక్కువుగా ట్రెండ్ అయ్యాయి. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి కృతిసనన్ గత ఏడాది చేసిన సినిమా ‘భేడియా’. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ ధావన్.. కృతిసనన్, ప్రభాస్ తో ప్రేమలో ఉంది అంటూ ఇన్‌డైరెక్ట్ గా వ్యాఖ్యానించాడు. దీంతో ఈ వ్యాఖ్యలు బాలీవుడ్, టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Prabhas: ప్రభాస్‌పై బాలీవుడ్ క్వీన్ కంగనా షాకింగ్ కామెంట్స్..!

ఇక ఈ విషయం పై వీరిద్దర్నీ పలు వేదికల ప్రశ్నిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అన్‌స్టాపబుల్ షోలో కూడా బాలకృష్ణ, ప్రభాస్ ని ఈ రూమర్స్ గురించి ప్రశించగా.. అటువంటిది ఏమి లేదని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇక కృతిసనన్ కూడా ఇప్పటికే పలుమార్లు దీని పై క్లారిటీ ఇవ్వగా, తాజాగా మరోసారి ఆ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కృతిని ఈ రూమర్స్ గురించి ప్రశ్నించగా.. ”మొదట నేను కూడా వీటిని పట్టించుకోలేదని, కానీ నా ఫ్రెండ్స్ నుంచి కూడా కంగ్రాట్యులేషన్స్ మెసేజ్ లు వస్తుండడంతో రెస్పాండ్ అయ్యాను. ఈ విషయం గురించి ముందుగా ప్రభాస్ కి క్లారిటీ ఇవ్వాలని అతనికి ఫోన్ చేశాను. ఇక కాల్ లిఫ్ట్ చేసిన ప్రభాస్.. అసలు వరుణ్ ఎందుకు అలా చెప్పాడంటూ నన్ను ప్రశ్నించాడు. నేను నాకు తెలియదు అని చెప్పాను. వరుణ్ నా ఫ్రెండ్, అతను పిచ్చిగా ఆలోచించి మనం ఇద్దరం ప్రేమలో ఉన్నాము అనుకున్నాడు అని చెప్పాను. అది విన్న ప్రభాస్ నవ్వాడు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.