Kshana Kshanam : వర్మ క్లాసిక్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌కు 30 ఏళ్లు

వెంకటేష్, శ్రీదేవి, రామ్ గోపాల్ వర్మ కలయికలో వచ్చిన ఎవర్ గ్రీన్ మూవీ ‘క్షణక్షణం’ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది..

Kshana Kshanam : వర్మ క్లాసిక్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌కు 30 ఏళ్లు

Kshana Kshanam

Kshana Kshanam: విక్టరీ వెంకటేష్, అతిలోక సుందరి శ్రీదేవి హీరో హీరోయిన్లుగా.. ‘శివ’ తో ట్రెండ్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో.. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద కె.ఎల్. నారాయణ, వై. లక్ష్మణ చౌదరి నిర్మించిన కల్ట్ క్లాసిక్ సినిమా ‘క్షణక్షణం’..

Kondapolam : రివ్యూ..

1991 అక్టోబర్ 9న విడుదలైన ఈ మూవీ 2021 అక్టోబర్ 9 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా మూవీ లవర్స్ అస్సలు మిస్ అవ్వరు. స్వరవాణి ఎమ్.ఎమ్. కీరవాణి కంపోజ్ చేసిన పాటలు ఎవర్ గ్రీన్..

Kshana Kshanam Sets

హైదరాబాద్‌లో జాబ్ చేసే సత్య (శ్రీదేవి) దగ్గరినుండి తాను పోలీసునని నాటకమాడి చందు అనే దొంగ (వెంకటేష్) సూట్ కేస్ కొట్టెయ్యడంతో స్టార్ట్ అయిన సినిమా ‘క్షణక్షణం’ వర్మ స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో కంటిన్యూ అవుతూ ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంది. సత్య బ్యాగులో ఉన్న క్లాక్ రూమ్ రిసీప్ట్ కోసం నాయర్ అలియాస్ మస్తాన్ (పరేష్ రావెల్), ఇన్స్‌పెక్టర్ యాదవ్ (రామిరెడ్డి) వెంటపడడం.. సత్య, చందు తప్పించుకుని అడవిలోకి పారిపోవడం.. అక్కడ వీళ్ల మధ్య లవ్.. చివరకి వాళ్ల నుంచి తప్పించుకుని హైదరబాద్ వచ్చి క్లాక్ రూమ్‌లో దాచిన కోటి రూపాయలున్న బ్యాగ్ తీసుకోవడం.. ఇలా ఉత్కంఠ భరితంగా సాగుతుంది సినిమా. చిన్న పాయింట్‌ని బేస్ చేసుకుని.. ఇలా కూడా సినిమా తియ్యొచ్చా అని సినీ పెద్దలు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా వర్మ ‘క్షణక్షణం’ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం అభినందనీయం.

Kshana Kshanam Movie

శ్రీదేవి, వెంకటేష్‌ల నేచురల్ పర్ఫార్మెన్స్, ఎస్. గోపాల్ రెడ్డి విజువల్స్, కీరవాణి పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్, సత్యానంద్ డైలాగ్స్ సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. ‘జామురాతిరి జాబిలమ్మ.. చలి చంపుతున్న చమక్కులో.. అమ్మాయి ముద్దు ఇవ్వందే.. కో అంటే కోటి.. అందనంత ఎత్తా తారాతీరం’ పాటలు బాగా పాపులర్ అయ్యాయి. బెస్ట్ యాక్ట్రెస్‌గా శ్రీదేవి, బెస్ట్ డైరెక్టర్‌గా రామ్ గోపాల్ వర్మ నంది అవార్డులు అందుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అందరి కెరీర్‌లో ‘క్షణక్షణం’ మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది.

KONDA : తెలంగాణ ‘రక్తచరిత్ర’