KTR Super Hero : కేటీఆర్ సూపర్ హీరో.. నాకు మంచి ఫ్రెండ్ : సోనూసూద్

కరోనా కష్టకాలంలో మీకు నేను ఉన్నానంటూ ఆదుకుంటున్న సోనూసూద్.. కరోనా రోగుల పాలిట ఆపద్భాందవుడిగా మారాడు. సాయం కోరితే చాలు.. క్షణాల్లో ఆక్సిజన్ సాయం అందిస్తు ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్నాడు.

KTR Super Hero : కేటీఆర్ సూపర్ హీరో.. నాకు మంచి ఫ్రెండ్ : సోనూసూద్

Ktr Super Hero

KTR Suer Hero : కరోనా కష్టకాలంలో మీకు నేను ఉన్నానంటూ ఆదుకుంటున్న సోనూసూద్.. కరోనా రోగుల పాలిట ఆపద్భాందవుడిగా మారాడు. సాయం కోరితే చాలు.. క్షణాల్లో ఆక్సిజన్ సాయం అందిస్తు ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్నాడు. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందక, మందులు దొరక్క.. బెడ్స్ అందుబాటులో లేక అల్లాడిపోతున్నారు.

ఇలాంటి సమయంలో వారికి అండగా ఒక్కడే ముందు సైనికుడిలా నిలబడ్డాడు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు సాయం చేస్తున్నసోనూసూద్‌ను రియల్ హీరో అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.

దీనిపై సోనూసూద్ స్పందిస్తూ.. కేటీఆర్ చాలా గొప్ప వ్యక్తి.. ఆయన సూపర్ హీరో.. నాకు చాలా మంచి స్నేహితుడు కూడా అన్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు. కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్నవారిని ఇలానే ఆదుకుంటానని చెప్పాను.

చాలామంది జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్నదే నా ఉద్దేశం.. ఏపీ, తెలంగాణలో ఎవరైనా నా సాయం కావాలంటే ఫోన్ కాల్ చేస్తేచాలు.. వారికి తాను చేయగలిగినంత సాయం చేస్తానని సోనూసూద్ తెలిపాడు.