Sammathame: కేటీఆర్ చేతుల మీదుగా ‘సమ్మతమే’ ట్రైలర్ లాంఛ్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాడు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం....

Sammathame: కేటీఆర్ చేతుల మీదుగా ‘సమ్మతమే’ ట్రైలర్ లాంఛ్

Ktr Launches Sammathame Trailer

Sammathame: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాడు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘సమ్మతమే’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు.

Sammathame: ‘బావ తాకితే’.. సత్యభామ సిగ్గుపడకుండా ఉండగలదా?!

ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. తన తల్లి స్థానంలో ఓ అమ్మాయి తన జీవితంలోకి రావాలని కోరుకునే అబ్బాయిగా కిరణ్ అబ్బవరం మనకు ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. అతడు వెతికే లక్షణాలు ఉన్న అమ్మాయిగా హీరోయిన్ చాందినీ చౌదరి కనిపిస్తుంది. అయితే ఆమె మోడ్రన్ జీవితానికి అలవాటై ఉండటంతో వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఏర్పడుతుంది, వారి ప్రేమకు ఏవైనా అడ్డంకులు ఏర్పడతాయా, వాటిని ఎలా అధిగమిస్తారు అనే కథాంశంతో ఈ సినిమా రానున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థం అవుతుంది.

Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం

మళ్లీ ఓ యూత్‌ఫుల్ కంటెంట్‌తో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ చాందినీ చౌదరి కూడా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తుంది. ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా నేటి యువతను ఆకట్టుకునే కథాంశంతో దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఈ సినిమాను రూపొందించగా, కె.ప్రవీణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ‘సమ్మతమే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందో చూడాలి.