Samantha: సమంతపై.. ఆ వీడియోలు తొలగించాల్సిందే: కోర్టు కీలక ఆదేశాలు

కొన్ని యూ ట్యూబ్ చానళ్లు చేసిన ప్రచారంపై.. సమంత దాఖలు చేసిన పిటిషన్ మీద కూకట్ పల్లి న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Samantha: సమంతపై.. ఆ వీడియోలు తొలగించాల్సిందే: కోర్టు కీలక ఆదేశాలు

Samantha

Samantha: నాగ చైతన్యతో విడాకుల అనంతరం.. కొన్ని యూ ట్యూబ్ చానళ్లు చేసిన ప్రచారంపై.. సమంత దాఖలు చేసిన పిటిషన్ మీద కూకట్ పల్లి న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సమంత వ్యక్తిగత వివరాలు ఎవరూ ప్రసారం చేయడానికి వీల్లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఇదే సమయంలో.. సమంతకు సైతం న్యాయస్థానం కీలక సూచన చేసింది. తన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండాలని చెప్పింది.

రెండు యూట్యూబ్ ఛానళ్లు.. తమ లింక్స్ ను తొలగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎవరూ కూడా సమంతకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ప్రసారం చేయవద్దని చెప్పింది. కోర్టు ఆదేశించిన ప్రకారంగా ఆ యూట్యూబ్ చానళ్లు చర్యలు స్పందించాల్సిందే అని సమంత తరఫు న్యాయవాది తెలిపారు.

సమంత కూడా ఎక్కడా వ్యక్తిగత విషయాలు షేర్ చేయకూడదన్న విషయంపై.. కోర్టు తీర్పు చేతికి వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని ఆమె తరఫు లాయర్ తెలిపారు. సమంతపై వచ్చిన వార్తల లింక్స్ కూడా ఎప్పటిలోగా తొలగించాలన్నదీ.. తీర్పు ప్రతులు చేతికి అందాకే చెప్పగలమని అన్నారు.

Read More:

Samantha : 3 యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దావా

Manchu Vishnu : హీరోయిన్స్ పై పిచ్చి పిచ్చి థంబ్‌నైల్స్‌ పెడితే ఊరుకోను.. యూట్యూబ్ ఛానల్స్ కి మంచు విష్ణు హెచ్చరిక