అప్పటి నుంచి అభిమానం: తారక్‌పై కుష్భూ ముద్దుల వర్షం

  • Published By: vamsi ,Published On : December 26, 2019 / 04:57 AM IST
అప్పటి నుంచి అభిమానం: తారక్‌పై కుష్భూ ముద్దుల వర్షం

టాలీవుడ్ టాప్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఆయనతో ఒక్క సినిమా అయినా చెయ్యాలని అనుకోని హీరోయిన్ ఉండదు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ క్రేజ్ అలాంటిది. వరుస హిట్లతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా ఉన్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. అయితే లేటెస్ట్‌గా వెటరన్ హీరోయిన్, కాంగ్రెస్ నాయకురాలు కుష్భూ తనకు ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానాన్ని ఓ ఇంటర్వ్యూలో వ్యక్తపరిచింది. 

స్క్రీన్‌పై ఉన్న ఎన్టీఆర్‌ బొమ్మకు ముద్దుల వర్షం కురిపించింది. ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయ్యే ‘ఆలీతో సరదాగా’ అనే ప్రోగ్రామ్‌కు గెస్ట్‌గా వచ్చిన ఖుష్బూ తెలుగులో తనకు ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫొటో చూడగానే ముద్దుల వర్షం కురిపించారు.

అంతేకాదు, తారక్ యమదొంగ సినిమాలోని యంగ్ యమ పాటకు కేకలు వేస్తూ డ్యాన్స్ చేసింది. తమిళంలో అరవింద స్వామి, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టం అని వెల్లడించింది కుష్భు. 

కుష్భు ముఖ్య పాత్రలో నటించిన అజ్ఞాతవాసి సినిమా టైమ్‌లో కూడా ఆమె తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘యమదొంగ’లో మోహన్ బాబు భార్యగా కుష్భు నటించింది. అప్పుడు ఎన్టీఆర్ నటనను చూసిన ఆమె ఫ్యాన్ అయిపోయారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చాలా సార్లు వెల్లడించారు. ఖుష్బూ తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు.