Shooting : షూటింగ్ లో గన్ పేలి లేడీ కెమెరామెన్ మరణం..

అప్పుడప్పుడు సినిమా షూటింగ్స్ లో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది దురదృష్టవశాత్తు ఆ ప్రమాదాల్లో మరణిస్తూ ఉంటారు. కానీ తాజాగా అనుకోకుండా షూటింగ్ లో గన్ పేలి ఓ సినిమాటోగ్రాఫర్

Shooting : షూటింగ్ లో గన్ పేలి లేడీ కెమెరామెన్ మరణం..

Hachins

Shooting :  అప్పుడప్పుడు సినిమా షూటింగ్స్ లో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది దురదృష్టవశాత్తు ఆ ప్రమాదాల్లో మరణిస్తూ ఉంటారు. కానీ తాజాగా అనుకోకుండా షూటింగ్ లో గన్ పేలి ఓ సినిమాటోగ్రాఫర్ మరణించారు. హాలీవుడ్ మూవీ ‘ర‌స్ట్’ సినిమా షూటింగ్ టైంలో సెట్‌లో అనుకోకుండా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మెక్సికోలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

Ajith : పాకిస్థాన్ ఇండియా బోర్డర్ వద్ద హీరో అజిత్

ఓ స‌న్నివేశం చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో ఓ ఆర్టిస్ట్ ప్రాప్ గ‌న్‌ని కాల్చారు. దీంతో ఈ సినిమాకి పని చేస్తున్న లేడీ సినిమాటోగ్రాఫ‌ర్ హచిన్స్‌ మృతిచెందారు. అంతే కాక ద‌ర్శ‌కుడు జోయొల్ సౌజా గాయ‌ప‌డ్డాడు. హచిన్స్ అక్కడే మరణించగా, దర్శకుడికి గాయాలు అవ్వడంతో హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. రిహార్స‌ల్ స‌మ‌యంలో తుపాకీ పేలిన‌ట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనపై ఎవరూ ఎలాంటి కంప్లైంట్స్ చేయలేదు. కానీ పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు. ఈ ఘటనలో మరణించిన లేడీ సినిమాటోగ్రాఫర్ హచిన్స్ కి హాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.