NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి

లక్ష్మి పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. ''ఎన్టీఆర్ ఒక మహానటుడుగా ప్రపంచనికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి. ఎన్టీఆర్ అవతార పురుషుడు. చరిత్రలోనే రాముడు, కృష్ణుడిని...........

NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి

Lakshmi Parvathi

NTR :  ఇవాళ మే 28న తెలుగు వారి యుగపురుషుడు, మహానేత, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన నాయకుడు, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి. ఈ సారి ఆయన శత జయంతి కూడా కావడంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

 

ఇక ప్రతి సారి లాగే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచే ఎన్టీఆర్ ఘాట్ కు అభిమానులు క్యూ కట్టారు. ఉదయమే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా విచ్చేసి ఆయనకి నివాళులు అర్పించారు. ఆ తర్వాత లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పించింది. నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు లక్ష్మి పార్వతి.

NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

లక్ష్మి పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. ”ఎన్టీఆర్ ఒక మహానటుడుగా ప్రపంచనికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి. ఎన్టీఆర్ అవతార పురుషుడు. చరిత్రలోనే రాముడు, కృష్ణుడిని భూమి మీదకు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆనాడు రాముడు, కృష్ణుడిని కూడా దేవుళ్ళుగా గుర్తించలేదు వారు చనిపోయిన తరువాతే దేవుళ్ళు అయ్యారు. ఎన్టీఆర్ కూడా రాబోయే రోజుల్లోఒక దేవుడుగా ఉంటారు. ఇపుడున్న తరాలకు ఆదర్శప్రాయుడు ఎన్టీఆర్. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ కు అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. ఎన్టీఆర్ కీర్తి ఎప్పటికీ నిలిచి వుంటుంది. ఎన్టీఆర్ అవార్డును 25 సంవత్సరాల నుంచీ ఇస్తున్నాను. ఎన్టీఆర్ అందరికీ ఇష్టమైన వ్యక్తి కానీ కొందరికి కంటగింపు అవుతుండటం దురదృష్టం అని తెలిపారు.