Lakshmi Vasudevan : నా ఫోన్ హ్యాక్ చేశారు.. నా ఫోటోలని మార్ఫింగ్ చేశారు.. కంటతడి పెట్టిన స్టార్ సీరియల్ నటి..

లక్ష్మి వాసుదేవన్ ఈ వీడియోలో మాట్లాడుతూ.. ''సెప్టెంబర్ 11న ఐదు లక్షల రూపాయలు గెలుచుకున్నారని మా అమ్మకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌తో పాటు ఓ లింక్ కూడా ఉంది. నేను అనుకోకుండా ఆ లింక్‌పై క్లిక్ చేశాను. దీంతో.............

Lakshmi Vasudevan : నా ఫోన్ హ్యాక్ చేశారు.. నా ఫోటోలని మార్ఫింగ్ చేశారు.. కంటతడి పెట్టిన స్టార్ సీరియల్ నటి..

Lakshmi Vasudevan posts a emotional video goes viral

Lakshmi Vasudevan :  ఒకప్పుడు సినిమాల్లో నటించిన లక్ష్మి వాసుదేవన్ ప్రస్తుతం తమిళ్, తెలుగు, కన్నడ సీరియల్స్ లో స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్నారు. వరుస సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ఏడుస్తూ ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

లక్ష్మి వాసుదేవన్ ఈ వీడియోలో మాట్లాడుతూ.. ”సెప్టెంబర్ 11న ఐదు లక్షల రూపాయలు గెలుచుకున్నారని మా అమ్మకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌తో పాటు ఓ లింక్ కూడా ఉంది. నేను అనుకోకుండా ఆ లింక్‌పై క్లిక్ చేశాను. దీంతో ఆటోమేటిక్ గా నా ఫోన్‌లో ఓ యాప్ ఇన్‌స్టాల్ అయింది. నా ఫోన్‌ని ఎవరో హ్యాక్ చేశారు. ఆ తర్వాత నాకు వరుసగా మెసేజ్‌లు వచ్చాయి. నేను లోన్ తీసుకున్నానని, వెంటనే లోన్ చెల్లించాలని మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ రావడమే కాక చాలా అసభ్యకరంగా మాట్లాడి నాకు వాయిస్ నోట్ పంపారు. 5 వేల రూపాయలు అప్పు కట్టకపోతే మీ ఫోటో అందరికి పంపిస్తామని బెదిరించారు. దీంతో నేను వెంటనే హైదరాబాద్‌లోని సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాను. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.”

SV Ramanan : మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంట తీవ్ర విషాదం..

”కానీ వాళ్ళు ఇంతలోనే నా ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, నా ఫోన్ ని హ్యాక్ చేసి నా వాట్సాప్‌లోని కొన్ని కాంటాక్ట్‌లకు పంపించారు. అందరూ నాకు కాల్స్, మెసేజ్ లు చేయడంతో నాకు ఏడుపు వచ్చింది. నా వాళ్లందరికీ నా గురించి తెలుసు. నేను ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి తప్పు లింక్స్ క్లిక్ చేయడం, తప్పు యాప్స్ ని క్లిక్ చేయడం, డబ్బు గెలుచుకున్నారని తెలియని నంబర్ నుంచి మీకు మెసేజ్ వస్తే క్లిక్ చేయడం లాంటివి చేయకండి. ఇలాంటివి నమ్మి మోసపోకండి.”

”సైబర్ క్రైమ్ పోలీసులు ఇలా ఓ వీడియో సందేశం చేసి పోస్ట్ చేయమన్నారు. దీనివల్ల అందరికి అవగాహన కలుగుతుందని తెలిపారు. ఇలాంటి లోన్ యాప్స్, ఫేక్ మెసేజ్ ల వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళలు ఇలాంటివి ఎదుర్కోవడం చాలా కష్టం. నిందితులు IP అడ్రస్‌లు మారుస్తూ మెసేజ్ లు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ దీనిపై వర్క్ చేస్తుంది. నాకు మీ అందరి మద్దతు కావాలి” అని ఎమోషనల్ అయ్యారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు, అభిమానులు, సీరియల్ ఆర్టిస్టులు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేసి ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు.