‘లక్ష్మీస్ ఎన్‌టీఆర్’ విడుదల వాయిదా: ప్రకటించిన వర్మ

  • Published By: vamsi ,Published On : March 19, 2019 / 03:31 AM IST
‘లక్ష్మీస్ ఎన్‌టీఆర్’  విడుదల వాయిదా: ప్రకటించిన వర్మ

ఎన్‌‌టీఆర్ జీవిత కథ నేపథ్యంలో సినీ, రాజకీయ వర్గాల్లో సంచలన సినిమాగా తెరకెక్కుతున్న సినిమా ‘లక్ష్మీ’స్ ఎన్‌టీఆర్’. ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడవడం అనే అంశాన్ని తీసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా.. సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై సంచలనం అయ్యాయి. ఈ క్రమంలో సినిమాను మార్చి 22వ తేదీన విడుదల చేయాలని భావించారు.
Read Also : శ్రీ దేవి బయోపిక్ లో బాలీవుడ్‌ హీరోయిన్‌!

అయితే వివాదాల చుట్టూ తిరుగుతున్న ఈ సినిమా..  టెక్నికల్ పరమైన సమస్యలు తలెత్తడంతో మార్చి 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందే సినిమా విడుదల చేయాలని పట్టుదలగా ఉన్న వర్మ.. సెన్సార్ బోర్డు పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేసి.. కోర్టు కేసు వరకు పోతానంటూ చెప్పారు. అయితే సెన్సార్ బోర్డుతో ఉన్న సమస్యలు తొలగిపోయాయంటూ వర్మ ప్రకటించారు. 

అయితే ఇవాళ 2019 మార్చి 19 విడుదల తేదీకి రొండు రోజులు మాత్రమే ఉంది. రేపు(మార్చి 20) సెన్సార్ స్క్రీనింగ్ జరిగినా కూడా సర్టిఫికేట్ రావడానికి సమయం పడుతుంది. ఈ క్రమంలో మార్చి 22వ తేదీన సినిమా విడుదల చేయడం అసాధ్యం. స్కీనింగ్ అనంతరం అభ్యంతరకరమైన సీన్లు, సంభాషణలు ఉంటే తొలగించి రీ స్క్రీన్ చేయడానికి సెన్సార్ నుండి క్లియరెన్స్ రావడం టెక్నికల్‌గా కుదరని పని. అందుకే సినిమాను మార్చి 29వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపిన వర్మ.. మార్చి 29వ తేదీన అసలు నిజాలు తెలుసుకుందాం అని పోస్ట్ చేశారు. 

Read Also : మరో మల్టీస్టారర్‌లో విక్టరీ వెంకటేష్!