Bheemla Nayak : ‘లాలా.. ఊరమాస్ భీమ్లా’..

దీపావళి కానుకగా ‘భీమ్లా నాయక్’ మూవీ నుండి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చింది టీం..

Bheemla Nayak : ‘లాలా.. ఊరమాస్ భీమ్లా’..

Bheemla Nayak

Bheemla Nayak: ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ రీమేక్స్‌లో ఒకటిగా సెన్సేషన్ అవుతున్న మూవీ ‘భీమ్లా నాయక్’.. పవర్‌‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి జోడీగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్య మీనన్, హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటికి జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు..

Jr Soundarya : సౌందర్య మళ్లీ పుట్టిందా?జూనియర్ సౌందర్యను చూశారా!

పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ రీమేక్ చేస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తుండగా.. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పవన్, రానా గ్లింప్స్, రెండు పాటలకు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే.

Bheemla Nayak : రిలాక్స్ అవుతున్న ‘భీమ్లా నాయక్’.. డానియెల్ శేఖర్.. లుక్ అదిరిందిగా!

దీపావళి కానుకగా ‘భీమ్లా నాయక్’ నుండి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చింది టీం. బుధవారం సాయంత్రం 7:02 గంటలకు ‘లాలా భీమ్లా’ వీడియో ప్రోమో వదలబోతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పవన్ పోస్టర్ వైరల్ అవుతోంది. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ‘భీమ్లా నాయక్’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Pragathi : క్యాట్‌వా‌క్‌తో కవ్విస్తున్న ప్రగతి