Bell Bottom : ఇందిరా గాంధీలా మారిన ఆ నటి ఎవరో తెలుసా..!

‘బెల్ బాటమ్’ ట్రైలర్‌లో ఇందిరా గాంధీ క్యారెక్టర్‌లో కనిపించిన ఆర్టిస్ట్ గురించే అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు..

Bell Bottom : ఇందిరా గాంధీలా మారిన ఆ నటి ఎవరో తెలుసా..!

Lara Dutta

Bell Bottom: అక్షయ్ కుమార్, వాణి కపూర్, హ్యూమా ఖురేషి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మూవీ ‘బెల్ బాటమ్’.. రంజిత్ తివారి డైరెక్షన్లో, పూజా ఎంటర్‌టైన్‌మెంట్, ఎమ్మాయ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. రీసెంట్‌గా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ రెట్రో కాన్సెప్ట్ మూవీలో ‘బెల్ బాటమ్’ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

Akshay Kumar : పది సినిమాలున్నా అన్ని కోట్లు నష్టపోయిన అక్షయ్ కుమార్..!

ట్రైలర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇందిరా గాంధీ క్యారెక్టర్‌లో కనిపించిన ఆర్టిస్ట్ గురించే అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ నటి ఎవరో కాదు.. మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో అచ్చు గుద్దినట్లు దిగిపోయారు లారా.

1984 లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ మూవీలో ఇందిరా గాంధీ పాత్రలో లారా దత్తా ఒదిగిపోయారని ప్రశంసిస్తూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. లారా, ఇందిరా గాంధీ క్యారెక్టర్ కోసం మేకప్ వేసుకుంటున్న వీడియో షేర్ చేశారు అక్షయ్. ప్రొస్థెటిక్ మేకప్‌కి నాలుగు గంటల టైం పడుతుంది. అంతసేపు కదలకుండా మేకప్ వేయించుకోవడం అంటే మాటలు కాదు.

 

View this post on Instagram

 

A post shared by Lara Dutta Bhupathi (@larabhupathi)

లారా దత్తా చీరకట్టు నుండి హెయిర్ స్టైల్ వరకు ఇందిరా గాంధీలానే దిగిపోయారంటూ సెలబ్రిటీలు, నెటిజన్లు అప్రిషియేట్ చేస్తున్నారు. ఆమె మేకప్ వేసుకుంటున్న పిక్స్, వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ‘బెల్ బాటమ్’ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆగస్టు 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాండమిక్ తర్వాత బాలీవుడ్‌లో రిలీజ్ అవుతున్న స్టార్ సినిమా ఇదే కావడం విశేషం.