Bigg Boss 5: ఈ వారమే లాస్ట్ ఎలిమినేట్… బయటకు వెళ్లేది ఈమేనా?

తెలుగు బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ ఐదవ సీజన్ ముగిసే సమయం దగ్గర పడింది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఇప్పుడు ఇంట్లో ఉండగా మరో ఎలిమినేషన్ మాత్రమే మిగిలి ఉంది.

Bigg Boss 5: ఈ వారమే లాస్ట్ ఎలిమినేట్…  బయటకు వెళ్లేది ఈమేనా?

Bigg Boss 5

Bigg Boss 5: తెలుగు బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ ఐదవ సీజన్ ముగిసే సమయం దగ్గర పడింది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఇప్పుడు ఇంట్లో ఉండగా మరో ఎలిమినేషన్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ముగిస్తే మరో వారం రోజులలో షో పూర్తయిపోతుంది. షోలో ఈ సీజన్ లాస్ట్ ఎలిమినేషన్ కు కూడా సమయం ఆసన్నమైంది. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఆరుగురిలో ఒకరి ఇంటి నుండి బయటికి వచ్చేయాల్సి ఉంది. మిగిలిన ఆ ఐదుగురిలోనే టైటిల్ విన్నర్ ఉండనున్నారు. అంటే టైటిల్ పోరులో ఒక్క అడుగు మాత్రమే మిగిలి ఉంది.

Ali Akbar: ఇకపై నేను ముస్లిం కాదు ఇండియన్.. మలయాళ ఫిల్మ్ డైరెక్టర్!

దీంతో ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకులు ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరా అన్నది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవిధంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అన్ లక్కీ అని కూడా నెటిజన్ల అభిప్రాయం. ఈ ఒక్క వారం ఇంట్లో ఉంటే కనీసం ఫైనల్స్ లో ఆడిన కంటెస్టెంట్ గా గుర్తింపుతో పాటు సంతృప్తి కూడా వాళ్ళ సొంతం అవుతుంది. అందుకే ఈ వారం ఇంటి నుండి బయటకి వచ్చేసే కంటెస్టెంట్ ఎవరా అన్న ఆసక్తి ఎక్కువగా కనిపిస్తుంది.

Vikki-Katrina : విక్కీ కత్రినా హల్దీ వేడుక ఫోటోలు

కాగా.. ఈ వారం ఎలిమినేట్ అయి ఫైనల్స్ మిస్ అయ్యే కంటెస్టెంట్ ఈమెనే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిపోతుంది. ఆ ప్రచారం ప్రకారం ఈ వారం ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ ఆర్జే కాజల్ అంటున్నారు. కాజల్ పై సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం కూడా ఇందుకు కారణం కావచ్చు. కాజల్ షోలో తొలి నుండి ఒక్కో కంటెస్టెంట్ తో స్నేహం చేస్తూ మైండ్ గేమ్ ఆడుతూ అందరినీ నమ్మించి బలి చేస్తుందని కొందరి నెటిజన్ల అభిప్రాయం. ఆ కారణంగానే కాజల్ ఓటింగ్ లో ఈ వారం ఎలిమినేషన్ అయినట్లుగా తెలుస్తుంది.