విషమంగానే లతామంగేష్కర్ ఆరోగ్యం

  • Published By: chvmurthy ,Published On : November 12, 2019 / 10:48 AM IST
విషమంగానే లతామంగేష్కర్ ఆరోగ్యం

ప్రముఖ గాయని, మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్ధితి విషమంగానే ఉందని ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సోమవారం తెల్లవారు ఝూమున  ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందికి గురవ్వటంతో బంధువులు ఆమెను బ్రీచ్ క్యాండి ఆస్పత్రికి తరలించారు. కొద్దిరోజుల క్రితం లతా మంగేష్కర్ కు నిమోనియా సోకింది.

మంగళవారం తెల్లవారు ఝామున  ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  ఆమె పరిస్ధితి ఆందోళన కరంగా ఉన్నప్పటికీ కోలుకుంటారని డాక్టర్ ప్రతీత్ సమ్దానీ తెలిపారు. గాయనిగా ఉండటం వల్ల ఆమె ఊపిరి తిత్తులు బాగా దెబ్బతిన్నాయని డాక్టర్లు వివరించారు. 

సెప్టెంబర్28, 1929లో జన్మించిన లతా మంగేష్కర్ తన పాటలతో ఆబాల గోపాలాన్ని అలరించారు. 1942 సంవత్సరంలో మహల్ సినమాతో గాయనిగా తన ప్రస్ధానాన్ని ఆమె ప్రారంభించారు.  దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు.  కేంద్రం ఆమెను పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారత రత్న, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది.