కోలుకుంటున్న లతా మంగేష్కర్

  • Published By: madhu ,Published On : November 15, 2019 / 08:30 AM IST
కోలుకుంటున్న లతా మంగేష్కర్

లెజండరీ గాయని, నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్ధితి మెరుగ్గా ఉందని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈమె ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. 2019, నవంబర్ 11వ తేదీ సోమవారం తెల్లవారు ఝూమున ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందికి గురవడంతో బంధువులు ఆమెను బ్రీచ్ క్యాండి ఆస్పత్రికి తరలించారు. కొద్దిరోజుల క్రితం లతా మంగేష్కర్ కు నిమోనియా సోకింది. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు ఆమె. 

ప్రస్తుతం ఆరోగ్యం మెరుగు పడిందని, ఆమె కోలుకుంటున్నారని కుటుంబసభ్యులు వెల్లడించారు. లత ఆరోగ్య విషయంలో అనవసర పుకార్లు సృష్టించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ‘లతా దీదీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమె కోలుకుంటున్నారు. మీ ఆదరాభిమానాలకు, చేసిన ప్రార్థనలకు ప్రతొక్కరికి కృతజ్ఞతలు’ అని లతా మంగేష్కర్ ట్విట్టర్ ఖాతా నుంచి ప్రకటన వెలువడింది.
Read More : వైరల్ అవుతున్న బన్నీ కిడ్స్ క్యూట్ పిక్
సెప్టెంబర్28, 1929లో జన్మించిన లతా మంగేష్కర్ తన పాటలతో ఆబాల గోపాలాన్ని అలరించారు. 1942 సంవత్సరంలో మహల్ సినమాతో గాయనిగా తన ప్రస్ధానాన్ని ఆమె ప్రారంభించారు. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు. వయోభారంతో కొన్నేళ్లుగా పాటలు పాడట్లేదు. మంగేష్కర్‌కు ఇప్పటికే పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులను ఇచ్చింది. ఆమె ఖాతాలో మూడు నేషనల్ అవార్డులు కూడా ఉన్నాయి.