Telugu Films Shooting: ఏ సినిమా ఏ దశ షూటింగ్‌లో ఉందంటే?

కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడే ఒక్కొక్క సినిమా ల్యాబుల నుండి బయటకొస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ భయాలు ఉన్నా.. అది పెద్దగా ప్రభావం చూపదని ఆశ మళ్ళీ సినిమాలపై ఆశలు రేకెత్తిస్తున్నాయి

Telugu Films Shooting: ఏ సినిమా ఏ దశ షూటింగ్‌లో ఉందంటే?

Telugu Films Shooting

Telugu Films Shooting: కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడే ఒక్కొక్క సినిమా ల్యాబుల నుండి బయటకొస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ భయాలు ఉన్నా.. అది పెద్దగా ప్రభావం చూపదని ఆశ మళ్ళీ సినిమాలపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. అందుకే కొత్త సినిమాలు ముమ్మరంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. పాట షూటింగ్ లో బిజీగా ఉంటే.. గోవాలో బాలకృష్ణ, హైదరాబాద్ లోనే మహేష్ సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఇక నానీ, రవితేజ సినిమాలు షూటింగ్ స్పీడప్ చేసి రకరకాల ప్లేసుల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Seetimaarr: సత్తా చాటిన గోపీచంద్.. పాజిటివ్ వైబ్ ఇచ్చిన సీటీమార్!

అయితే, ఏ సినిమా ఎక్కడి వరకొచ్చిందో, ఏ సినిమాలు ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయో ఆయా హీరోలకు తెలుసుకోవాలని ఉండడం సాధారణ విషయం. అందుకే ఒకసారి అలా లుక్కేద్దాం. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా లాస్ట్ స్టేజ్ కి రాగా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే కోకాపేటలో షూటింగ్ జరుగుతుంది. చిరంజీవి, రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక, త్వరలోనే చరణ్-పూజాహెగ్డేలపై ఓ పాట షూట్ ప్లాన్ చేసింది టీమ్.

Prabhas: ప్రభాస్ బాడీ బిల్డింగ్ తిప్పలు.. రెస్ట్ కోసం ఫారిన్ టూర్?

మహేష్ బాబు, పరశురామ్ డైరెక్షన్ లో నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సూపర్ ఫాస్ట్ గా జరుగుతోండగా.. బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న అఖండ సినిమా షూటింగ్ గోవా కి షిఫ్ట్ అయ్యింది. గోవాలో 3 రోజులు షెడ్యూల్ కి బిజీగా ఉంది టీమ్. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న రామారావు అన్ డ్యూటీ షూటింగ్ ఫిలిం సిటీలో కంటిన్యూ అవుతోండగా.. సీనియర్ హీరో నాగార్జున ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నటిస్తున్న ఘోస్ట్ చిత్రం షూటింగ్ శామీర్ పెట్ లో జరుగుతుంది.

Horror Movies: బంపర్ అఫర్.. ఈ హార్ర‌ర్ సినిమాలు చూస్తే రూ.ల‌క్ష పారితోష‌కం!

ఇక, బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫామ్ లో ఉన్న నాని నటిస్తున్న అంటే సుందరానికి సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా.. సీటీమార్ తో సూపర్ హిట్ కొట్టిన గోపిచంద్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్ మోయినాబాద్ లో జరుగుతుంది. ఇక శర్వానంద్ నటిస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా ఇప్పుడు కూడా అక్కడే కంటిన్యూ అవుతోంది.